MAA Election: విష్ణు నా క్రమశిక్షణకి వారసుడు.. ఓటేయాలని మోహన్ బాబు లేఖ!

‘మా’ (MAA) అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు.. అదొక బాధ్యత. ఈసారి ఎన్నికల్లో నా కుమారుడు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు. నా బిడ్డ నా క్రమశిక్షణకి, నా కమిట్‌మెంట్‌కి వారసుడు.

MAA Election: విష్ణు నా క్రమశిక్షణకి వారసుడు.. ఓటేయాలని మోహన్ బాబు లేఖ!

Maa Election

MAA Election: ‘మా’ (MAA) అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు.. అదొక బాధ్యత. ఈసారి ఎన్నికల్లో నా కుమారుడు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు. నా బిడ్డ నా క్రమశిక్షణకి, నా కమిట్‌మెంట్‌కి వారసుడు. తను ఇక్కడే ఉంటాడు. ఈ ఊళ్లోనే ఉంటాడు. ఏ సమస్య వచ్చినా మీ పక్కనే ఉంటాడని నేను మాటిస్తున్నా. మీరు మీ ఓటుని విష్ణుతో పాటు పూర్తి ప్యానల్‌కు వేసి సమర్థవంతమైన పాలనకి సహరించాలని మనవి’ అంటూ సీనియర్ నటుడు మోహన్ బాబు ఓ బహిరంగ లేఖ రాశారు.

Telugu Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద తెలుగు హీరోల దండయాత్ర!

అక్టోబరు 10న మా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో మరోవైపు ప్రకాశ్‌రాజ్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా ఎన్నికల ప్రచారం సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించేలా సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణల మాటల యుద్ధంతో పాటు ఎవరికి వారు ఓట్ల వేటలో కూడా దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా విష్ణుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ మోహన్ బాబు శుక్రవారం ఓ లేఖ విడుదల చేశారు. ఇందులో తన సినీ ప్రస్థానంతో పాటు విష్ణుకు ఎందుకు ఓటెయ్యాలో కూడా ఆయన స్పష్టం చేశారు.

Telugu Star Hero’s: స్టార్ హీరోల బిజీ షెడ్యూల్స్.. ఒకటి కాగానే మరొకటి సెట్స్ మీదకి!

‘మా’ అధ్యక్ష పదవంటే కిరీటం కాదన్నా మోహన్ బాబు.. అదోక బాధ్యతన్నారు. ‘నేను మీ అందరిలో ఒకడిని. ఇండస్ట్రీలో కష్టం వచ్చిన ప్రతి సారి నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చిన దివంగత దర్శకుడు దాసరి నారాయణ గారి అడుగు జాడల్లో నడుస్తున్న ఆయన బిడ్డను. మీలో ఒకడిని. నిర్మాతలతో పాటు నిర్మాతని, నటులతో పాటు నటుడిని, దర్శక శాఖ పని చేసిన వాడిని.. చేసిన సాయం, ఇచ్చిన దానం ఎప్పటికీ చెప్పొద్దంటారు. కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ లేఖలో ఇప్పటి పరిస్థితిని చెప్పుకొచ్చారు.

Annaatthe: సిద్ శ్రీరామ్, శ్రేయ ఘోషల్.. ‘అన్నాత్తై’ నుండి మంచి మెలోడీ

1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ సంస్థని స్థాపించిన రోజు నుంచి నేటి వరకు ఎన్నో చిత్రాలను నిర్మించి.. ఎందరో టెక్నిషియన్లను, కళాకారులను ఇండస్ట్రికీ పరిచయం చేశాను. 24 క్రాఫ్ట్స్‌లో ఉన్న ఎంతోమంది పిల్లలకి మరణించిన సినీ కళాకారుల పిల్లలకి మన విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యా సౌకర్యాలు కల్పించి వాళ్లు గొప్ప స్థాయికి చేరేలా చేశాను. భవిష్యత్తులో కూడా దాన్ని కొనసాగిస్తాను. ఇక ‘మా’ అధ్యక్ష పదవిలో నేను ఉన్నప్పుడే వృద్ధాప్య పింఛన్లని ప్రవేశపెట్టాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి’ అంటూ మోహన్‌ బాబు తన లేఖలో రాసుకొచ్చారు.