Bollywood Drug Case : సమీర్ వాంఖడే హిందువా? ముస్లిమా?.. జాతీయ స్థాయిలో చర్చ

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోన‌ల్ డైర‌క్ట‌ర్ స‌మీర్ వాంఖ‌డే ఏ మతానికి చెందిన వారన్నది చర్చనీయాంశంగా మారింది.

Bollywood Drug Case :  బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.. ఈ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై జోన‌ల్ డైర‌క్ట‌ర్ స‌మీర్ వాంఖ‌డే ఏ మతానికి చెందిన వారన్నది చర్చనీయాంశంగా మారింది. అతడు ముస్లిం అని, అతడికి డీ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని మహారాష్ట్ర మంత్రి కాంగ్రెస్ నేత నవాబ్ మాలిక్ ఆరోపించారు. తప్పుడు కులధ్రువీకరణ పత్రం పెట్టి సమీర్ ఉద్యోగం సాధించారని ఆరోపణలు గుప్పించారు. సమీర్ ముస్లిం అని, అతడు ‘హిందూ షెడ్యూల్ క్యాస్ట్’ సర్టిఫికెట్‌పై ఉద్యోగం సాధించాడని అన్నారు.

చదవండి : ఆర్యన్ ఖాన్ కేసులో మరో ట్విస్ట్.! _ Big Twist in Aryan Khan Case _ Sameer Wankhede

ఇక మంత్రి ఆరోపణలపై స్పందించారు వాంఖడే.. తాను హిందువునని చెబుతూ తన కుటుంబ వివరాలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తన కుల ధ్రువీకరణ ప‌త్రాన్ని .. ఢిల్లీలోని నేష‌న‌ల్ క‌మిష‌న్ ఫ‌ర్ షెడ్యూల్ క్యాస్ట్‌కు స‌మ‌ర్పించారు. తాను షెడ్యూల్ కులానికి చెందిన వాడినని వాంఖడే స్పషం చేశారు. ఇక సమీర్ కులధృవ పత్రంపై ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు సుభాష్ రామ్ నాథ్ స్పందించారు. పత్రాల పరిశీలన తర్వాత వివరణ ఇస్తామని తెలిపారు. స‌మీర్ అంద‌జేసిన డాక్యుమెంట్ల‌ను మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ద్ద ప‌రిశీలిస్తామ‌ని జాతీయ ఎస్సీ క‌మిష‌న్ చైర్మ‌న్ విజ‌య్ సంపాలా తెలిపారు.

చదవండి : Sameer Wankhede : ఎవరీ సమీర్‌ వాంఖడే?.. ఆయనపై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి?

మంత్రి వ్యాఖ్యలపై పత్రిక ముకంగా స్పందించిన వాంఖడే త‌న తండ్రి ధ్యాన్‌దేవ్ క‌చ్రూజీ వాంఖ‌డే ద‌ళితుడ‌ని, ఎక్సైజ్ శాఖ ఇన్‌స్పెక్ట‌ర్‌గా చేసి రిటైర‌య్యార‌ని, ఆయ‌న హిందువు అని, త‌ల్లి జ‌హీదా ముస్లిం మ‌త‌స్తురాల‌ని స‌మీర్ త‌న స్ప‌ష్టం చేశారు. కాగా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అనంతరం సమీర్ వాంఖడే పేరు మరు మోగింది. కేసు విషయంలో నిస్పక్షపాతంగా వ్యవహరించారంటూ ఆయనపై ప్రశంశలు కురిపించారు ప్రజలు. ఈ తరుణంలోనే వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు