Mumbai On High Alert : ఉగ్రదాడికి స్కెచ్..ముంబై హై అలర్ట్

కొత్త సంవత్సర వేడుకల సమయంలో ముంబైలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖలీస్థానీ తీవ్రవాదులు దాడులకు పాల్పడవచ్చేనే నిఘావర్గాల సమాచారం అందడంతో ముంబై పోలీసులు

Mumbai

Mumbai On High Alert : కొత్త సంవత్సర వేడుకల సమయంలో ముంబైలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖలీస్థానీ తీవ్రవాదులు దాడులకు పాల్పడవచ్చేనే నిఘావర్గాల సమాచారం అందడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.

రద్దీ ఎక్కువగా ఉండే ఏరియాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బాంద్రా,దాదర్,చర్చ్గేట్,కుర్ల తదితర స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. పోలీసులకు సెలవులు రద్దు చేసి అందరిని అలర్ట్ చేశారు. 3వేల మంది పోలీసులను ప్రధాన రైల్వే స్టేషన్ల దగ్గర నిఘా పెట్టేలా ఏర్పాటు చేశామని ముంబై రైల్వేపోలీస్ కమిషనర్ ఖలిద్ తెలిపారు.

కాగా,ముంబైలో కోవిడ్ కారణంగా ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది.దీనికి తోడు హోటళ్లు, రెస్టారెంట్లు, బాంకెట్ హాల్స్, బార్‌లు, పబ్‌లు, ఆర్కెస్ట్రాలు, రిసార్ట్‌లు, క్లబ్‌లు, రూఫ్‌టాప్‌లతో సహా ఏదైనా మూసి ఉన్న లేదా బహిరంగ ప్రదేశంలో అన్ని నూతన సంవత్సర వేడుకలు, కార్యక్రమాలు, ఫంక్షన్‌లు, సమావేశాలపై నిషేధం విధించారు.

ALSO READ Covid Cases In Mumbai : ముంబైపై కోవిడ్ పంజా..ఒక్కరోజే దాదాపు 4వేల కేసులు