Covid Cases In Mumbai : ముంబైపై కోవిడ్ పంజా..ఒక్కరోజే దాదాపు 4వేల కేసులు

భారత్ లో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా కోవిడ్ ఫస్ట్ వేవ్,సెకండ్ వేవ్ సమయంలో కేసులు భారీగా నమోదైన మహారాష్ట్రపై కరోనా మరోసారి విజృంభిస్తోంది.

Covid Cases In Mumbai : ముంబైపై కోవిడ్ పంజా..ఒక్కరోజే దాదాపు 4వేల కేసులు

Covid2

Covid Cases In Mumbai :  భారత్ లో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా కోవిడ్ ఫస్ట్ వేవ్,సెకండ్ వేవ్ సమయంలో కేసులు భారీగా నమోదైన మహారాష్ట్రపై కరోనా మరోసారి విజృంభిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 5,368 కొత్త కోవిడ్ కేసులు,22 మరణాలు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే గురువారం ప్రకటించారు. బుధవారంతో పోల్చితే 1468 కేసులు పెరిగినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 18,217కి చేరినట్లు చెప్పారు.

అయితే రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు ముంబైలోనే నమోదయ్యాయి. ముంబైలో ఇవాళ 3,671 కోవిడ్ కేసులు నమోదుకాగా,నిన్న నమోదైన కేసుల కంటే 46.25శాతం కేసులు అధికంగా నమోదైనట్లు మంత్రి రాజేష్ తోపే తెలిపారు. ముంబైలో పాజిటివిటీ రేటు 8.48శాతంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ఈ ఏడాది మే-5 తర్వాత ముంబైలో ఒక్కరోజులో నమోదైన కోవిడ్ కేసుల్లో ఇదే అత్యధికం. అయితే ముంబైలో ఇవాళ ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదుకాకపోవడం కొంత ఊరట కలిగించే విషయం.

ఇక,ముంబైతో పాటు,రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి రాజేష్ తోపే ఆదేశించారు. అదేవిధం,అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా,వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కోవిడ్ గైడ్ లైన్స్ పాటించాలని కోరారు. అయితే కోవిడ్ కారణంగా రాష్ట్రంలో స్కూల్స్ ప్రస్తుతానికి అయితే మూసివేసే ఉద్దేశ్యం లేదని మంత్రి సృష్టం చేశారు.

ఇక,కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” కేసులు కూడా మహారాష్ట్రలో భారీగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇవాళ 198 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 450కి చేరింది.

ALSO READ Arunachal Pradesh : బరితెగించిన డ్రాగన్..అరుణాచల్ లో మరో 15 గ్రామాలకు చైనా పేర్లు