రామమందిర నిర్మాణానికి ముస్లింలు సహకరించాలి : రాందేవ్ బాబా

దశాబ్దాలుగా కొనసాగిన వివాదాస్పద రామజన్మ భూమి-బాబ్రి మసీదు కేసుపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మాట్లాడతూ..సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని అభివర్ణించారు. రామ మందిర నిర్మాణానికి ముస్లింలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ తీర్పు వెలువడిని ఈ సమయం భారతదేశానికి అగ్ని పరీక్షలాంటిదనీ ఈ పరీక్షలో భారతీయులంతా సమన్వయం పాటించాలనీ..ఎటువంటి మత విద్వేషాలక తావివ్వకుండా భారతీయులంతా ఒక్కటేనని చాటి చెప్పాలని సూచించారు. ఈ తీర్పు వెలువడిన క్రమంలో విదేశీ శక్తులను ఛేదించాలని పిలుపునిచ్చారు.శ్రీరాముడు భారతీయులందరికీ మూల పురుషుడని బాబా రాందేవ్ అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ఇలా..
సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై చీఫ్ జడ్జి జస్టిస్ రంజన్ గొగోయ్ చదివి వినిపించగా.. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు.
ప్రార్థనా మందిరాల చట్టం ప్రాథమిక విలువలు, మత సామరస్యాన్ని పరిరక్షిస్తుందని వెల్లడించారు. వివాదాస్పద స్థలంలో మందిరం ఉన్నట్టు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని అన్నారు. పురావస్తు శాఖ నివేదికల ప్రకారమే తీర్పునిస్తున్నామని తెలిపారు. అయోధ్య చట్టం ప్రకారం మూడు నెలల్లో ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి ఆదేశించింది సుప్రీంకోర్టు.
‘సున్నీ బోర్డుకు ఐదు ఎకరాల అనువైన స్థలం కేటాయించాలి. 1993లో కేంద్రం స్వాధీనం చేసుకున్న భూమి నుంచి ఐదు ఎకరాలు కేటాయించవచ్చు. భూమి ఎక్కడ కేటాయించాలో కేంద్రం నిర్ణయించాలి. వివాదాస్పదమైన స్థలాన్ని పంచే ప్రసక్తే లేదు. వివాదాస్పద స్థలం రాంలాలాకే చెందుతుంది’. అంటూ సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.
134 సంవత్సరాలుగా వివాదంలో ఉంది రామజన్మభూమి – బాబ్రీ మసీదు భూమి. దేశంలోని కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడిన కేసులో తీర్పు ఇవ్వడం సుప్రీం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.