Muslim library BhagavadGita: ముస్లిం వ్యక్తి లైబ్రరీలో 3వేల భగవద్గీత కాపీలు

మతపరంగా ముస్లిం అయిన ఆ వ్యక్తి 3వేల కాపీల భగవద్గీత పుస్తకాలను అందులో..

Muslim library BhagavadGita: ప్రమాదకరమైన ఘటనలో బయటపడిన అద్భుతం ఇది. 62ఏళ్ల వయస్సున్న రోజువారీ కూలీ 11వేల పుస్తకాలతో లైబ్రరీ నిర్వహిస్తుండటమే కాక మతపరంగా ముస్లిం అయిన ఆ వ్యక్తి 3వేల కాపీల భగవద్గీత పుస్తకాలను అందులో ఉంచాడు. సయ్యద్ ఇజాక్ అనే వ్యక్తి రాజీవ్ నగర్, శాంతి నగర్ లలో ఉండే వారికి పదేళ్లుగా చదువుకునేందుకు ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాడు.

చదువుతో సంబంధం లేకుండా ఇజాక్.. అండర్ గ్రౌండ్ డ్రైనేజి క్లీనర్ గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా బతకడానికి చాలా పనులు చేస్తూ వచ్చాడు. ఇదిలా ఉంటే.. శుక్రవారం ఉదయం 4గంటల సమయంలో లైబ్రరీ పక్కన ఉండే ఓ వ్యక్తి లోపల మంటలు అంటుకున్నాయంటూ వచ్చి ఇజాక్ కు చెప్పాడట.

లోపలికి వెళ్లి చూసేసరికి.. బూడిదగా మిగిలిపోయి ఉన్నాయని కంటతడి పెట్టుకున్న ఇజాక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజల్లో చదివే అలవాటు పెంచాలని, కన్నడ నేర్చుకునేలా ఉండాలని పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు చెప్తున్నాడు. రాజీవ్ నగర్ సెకండ్ స్టేజ్ లో అమ్మర్ మసీదు దగ్గర కార్పొరేషన్ పార్క్ లోపలి భాగంలో ఓ షెడ్ ఏర్పాటు చేసి అందులో లైబ్రరీని నిర్వహించేవాడు. ప్రతి రోజూ 100 నుంచి 150 మంది లైబ్రరీకి వచ్చి పుస్తకాలు చదువుకునేవారు.

దాదాపు రోజూ కన్నడ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ్ భాషల్లో 17న్యూస్ పేపర్లు కొనుగోలు చేసి అక్కడ ఉంచేవాడు. సుమారు 85శాతం పుస్తకాలు కన్నడ భాషలోనే ఉండగా మిగిలినవి ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉన్నాయి. లైబ్రరీలో 3వేల భగవద్గీత కాపీలు ఉండగా వెయ్యి కాపీలు ఖురాన్, బైబిల్ ఉన్నాయి. మిగిలినవి పలు కేటగిరీల పుస్తకాలు.

లైబ్రరీ మెయింటైన్ చేయడానికి డబ్బులు ఏమీ ఖర్చుపెట్టకపోయినా న్యూస్ పేపర్ల కోసం నెలకు రూ6వేల వరకూ వెచ్చించేవాడు. ఇక లైబ్రరీలో మంటలు చెలరేగి నష్టం వాటిల్లిందని పోలీస్ స్టేషన్ కు వెళ్లి మొరపెట్టుకున్నాడు ఇజాక్. నా ఉద్దేశం ఒకటే కన్నడ నేర్చుకోవాలి, కన్నడలో మాట్లాడాలి. అందుకోసం లైబ్రరీని పునర్నిర్మిస్తా. అని అంటున్నాడు ఇజాక్.

 

 

ట్రెండింగ్ వార్తలు