ముస్లింలు మమ్మల్ని నమ్మరు : మేం కూడా టిక్కెట్లు ఇవ్వం : బీజేపీ నేత
సార్వత్రిక ఎన్నికలకు వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారాల్లో దూసుకెళ్తున్నాయి. పొలిటికల్ హీట్ మొదలైంది. రాజకీయ నేతలు ఒక పార్టీపై ఒకరు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికలకు వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారాల్లో దూసుకెళ్తున్నాయి. పొలిటికల్ హీట్ మొదలైంది. రాజకీయ నేతలు ఒక పార్టీపై ఒకరు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.
కొప్పల్ : సార్వత్రిక ఎన్నికలకు వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారాల్లో దూసుకెళ్తున్నాయి. పొలిటికల్ హీట్ మొదలైంది. రాజకీయ నేతలు ఒక పార్టీపై ఒకరు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కె.ఎస్ ఈశ్వరప్ప మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
ముస్లింలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో రాజకీయ దుమారం రేపాయి. ఉత్తర కర్ణాటకలోని కొప్పల్ ప్రాంతంలో కుర్భా, మైనార్టీ కమ్యూనిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈశ్వరప్ప మాట్లాడారు. కర్ణాటకలో ముస్లింలకు టికెట్లు ఇచ్చేది లేదంటూ వ్యాఖ్యానించారు.
ముస్లింలు బీజేపీని నమ్మే పరిస్థితి లేనప్పుడు వారికి టికెట్ ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించారు. తమ పార్టీని నమ్మితే టికెట్లు ఇస్తాం.. లేదంటే లేదు అని ఈశ్వరప్ప కన్నడ భాషలో వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే మాత్రం ముస్లింలకు టికెట్లు ఇచ్చేదిలేదని అన్నారు.
కుర్భా వర్గం నుంచి సభ్యునిగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఈశ్వరప్ప 2018 ఫిబ్రవరిలో కూడా ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళపై కూడా ఈశ్వరప్ప అసభ్యకర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలో 14 స్థానాలకు ఏప్రిల్ 18న, మరో 14 స్థానాలకు ఏప్రిల్ 23 ఎన్నికలు జరుగనున్నాయి.