గడ్కరీ ఇంటి వద్ద పోలీసులపై బైక్ విసిరేసిన యువకులు

గడ్కరీ ఇంటి వద్ద పోలీసులపై బైక్ విసిరేసిన యువకులు

Updated On : September 11, 2019 / 3:04 PM IST

కొత్త వాహనాల చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. పలు చోట్ల నిరసనలు పేట్రేగిపోతున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇంటిపై బైక్ విసిరేశారు.

ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారంటూ బుధవారం కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆ తర్వాత స్కూటర్, మోటర్ బైక్‌ను బారికేడ్ల పై నుంచి ఎత్తేశారు. సాధారణ వ్యక్తులు భారీ ఫైన్ లు కట్టలేరని ఆరోపించారు. 

‘ప్రభుత్వం భారీ ఫైన్ లు వేయడానికి బదులుగా ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఎలా బాగుచేయాలా అని ఆలోచించాలి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు బదులుగా లైసెన్స్ ఇచ్చే పద్ధతిలోనే మార్పులు తీసుకురావాలి. డ్రైవింగ్ సరిగ్గా వస్తేనే లైసెన్స్ ఇవ్వాలని నిర్దేశించాలి’ అని నినాదాలు చేశారు. వారిలో కొందరు మెడికల్ ఎమర్జెన్సీ అయినప్పుడు ట్రాఫిక్ ఫైన్ లకు భయపడి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా అంటూ ప్రశ్నించారు.