Gyanvapi : జ్ఞానవాపి మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలు గుర్తించిన మైసూరు పురావస్తు శాఖ

కాశీ జ్ఞానవాపి మసీదు వివాదంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంచలన విషయాలు వెల్లడించింది. మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలు గుర్తించినట్లు ఏఎస్ఐ డైరెక్టర్ కె.మునిరత్నం వెల్లడించారు.

Gyanvapi

Gyanvapi : కాశీ జ్ఞానవాపి మసీదు వివాదంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు పెద్ద హిందూ దేవాలయం ఉండేదని మైసూర్‌లోని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం (ASI) నివేదిక వెల్లడించింది. మసీదు పశ్చిమ గోడ హిందూ దేవాలయంలో భాగమని, 32 హిందూ దేవాలయ శాసనాలు దొరికాయని ASI నివేదిక పేర్కొంది. వాటిలో 3 తెలుగు శాసనాలను ASI గుర్తించింది. ఏఎస్ఐ డైరెక్టర్ కె.మునిరత్నం నేతృత్వంలోని నిపుణుల బృందం తెలుగులో ఉన్న మూడు శాసనాలతో సహా 34 శాసనాల వివరాలను తమ నివేదికలో సమర్పించింది. 17వ శతాబ్దానికి చెందిన ఒక శాసనంలో నారాయణ భట్ల కుమారుడు మల్లన భట్లు వంటి వారి పేర్లు పేర్కొన్నట్లు మునిరత్నం స్పష్టం చేశారు.

జ్ఞానవాపి మసీదు కింద భారీ హిందూ ఆలయం ఆనవాళ్లు.. ఏఎస్ఐ సంచలన నివేదిక

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలను మైసూరులోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం గుర్తించింది. ఏఎస్ఐ డైరెక్టర్ కె.మునిరత్నం నేతృత్వంలోని నిపుణుల బృందం తెలుగులో ఉన్న 3 శాసనాలతో పాటు 34 శాసనాలను విడదీసి కాశీ విశ్వనాథ దేవాలయం ఉనికిపై నివేదికను సమర్పించారు. ఇవి దేవనగరి, గ్రంథ, తెలుగు, కన్నడ లిపులలో ఉన్నాయి. వీరి నివేదికలో 1585 లో కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణాన్ని నారాయణ భట్లు పర్యవేక్షించారని ఆయన  తెలుగు బ్రాహ్మణుడని తెలుస్తోంది. 15వ శతాబ్దంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేయాలని జౌన్‌పూర్‌కి చెందిన హుస్సేన్ షర్కీ సుల్తాన్ (1458-1505) ఆదేశించాడని చెబుతారు. ఈ ఆలయం 1585 లో పునర్నిర్మించారు. రాజా తోడరమల్ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించవలసిందిగా దక్షిణ భారతదేశానికి చెందిన నిపుణుడు నారాయణ భట్లుడిని కోరినట్లు చెబుతారు. ప్రస్తుత శాసనంపై ఈ విషయం స్పష్టమైంది.

Gyanavapi Case : జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు ఎదురుదెబ్బ.. పిటిషన్‌లను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు

జ్ఞానవాపి మసీదు గోడపై చెక్కబడిన శాసనం తెలుగు భాషలో వ్రాయబడిందట. అది పాడైపోయి అసంపూర్తిగా ఉన్నప్పటికీ అందులో మల్లన్నభట్లు, నారాయణ భట్లు పేర్లు ఉన్నాయని ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం చెప్పారు. ఇక మసీదు లోపల దొరికిన రెండవ తెలుగు శాసనంపై ‘గోవి’ ప్రస్తావన ఉందట. అంటే  గొర్రెల కాపరులు. మూడవ శాసనం 15వ శతాబ్దానికి చెందినది. ఇది మసీదు ఉత్తరం వైపున ఉన్న ప్రధాన ద్వారం వద్ద ASI నిపుణులు కనుగొన్నారు. దానిలో 14 లైన్లు ఉండగా అవి పూర్తిగా అరిగిపోయాయట. ఈ విషయాలను ASI నివేదిక స్పష్టం చేస్తోంది.

జ్ఞానవాపి మసీదు కింద హిందూ దేవాలయం ఉందని హిందూ కక్షిదారులు జిల్లా కోర్టులో పిటిషన్ వేసారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సర్వేకు గతేడాది జూలై 21న కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  సర్వే నిర్వహించిన ASI తమ నివేదికను కోర్టుకు డిసెంబర్ 18 న నివేదించింది. ఈ నివేదిక ప్రతులను హిందూ, ముస్లిం కక్షిదారులకు అందించారు.

ట్రెండింగ్ వార్తలు