Gyanavapi Case : జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు ఎదురుదెబ్బ.. పిటిషన్‌లను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు

జ్ఞానవాపి మసీదులో సమగ్ర సర్వేను నిర్వహించాలని వారణాసి ట్రయల్ కోర్టు ఏప్రిల్ 8, 2021 నాటి ఆదేశాలను అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ (ఏఐఎంసీ), ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు డిసెంబరు వ్యతిరేకించాయి.

Gyanavapi Case : జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు ఎదురుదెబ్బ.. పిటిషన్‌లను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు

Gyanavapi Case

Updated On : December 19, 2023 / 11:05 AM IST

Gyanavapi Case – Allahabad High Court : జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు ఎదురుదెబ్బ తగలింది. జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్‌లో ఉన్న సివిల్ దావా విచారణ అర్హత సవాలు చేస్తూ వచ్చిన మొత్తం ఐదు పిటిషన్‌లను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. 1991లో హిందు సంఘాలు వేసిన పిటిషన్ చెల్లుబాటు అవుతుందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.

జ్ఞానవాపి మసీదులో సమగ్ర సర్వేను నిర్వహించాలని వారణాసి ట్రయల్ కోర్టు ఏప్రిల్ 8, 2021 నాటి ఆదేశాలను అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ (ఏఐఎంసీ), ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు డిసెంబరు వ్యతిరేకించాయి. జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ డిసెంబర్8న తీర్పును రిజర్వ్ చేశారు.

Ayodhya Ram Temple : అయోధ్య రామాలయం థీమ్‌తో డైమెండ్ న‌క్లెస్.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే?

1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం (ప్రత్యేక నిబంధనలు) చట్టం ప్రకారం ఆగస్టు15, 1947కి ముందు మతపరమైన ప్రదేశాల స్వరూపాన్ని ఉనికిలో ఉన్నట్లుగా మార్చడాన్ని పరిమితం చేస్తుందని అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ, ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ వాదనలు వినిపించాయి. మసీదులో పూజలకు అనుమతించాల్సిందిగా హిందువులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ కొనసాగనుంది.