Ayodhya Ram Temple : అయోధ్య రామాలయం థీమ్‌తో డైమెండ్ నెక్లెస్.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే?

వచ్చే ఏడాది జనవరి 22న భారీ వేడుకల మధ్య భక్తులకోసం రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 6వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది.

Ayodhya Ram Temple : అయోధ్య రామాలయం థీమ్‌తో డైమెండ్ నెక్లెస్.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే?

diamond necklace

Updated On : January 8, 2024 / 12:24 PM IST

Diamond Necklace : దేశ వ్యాప్తంగా హిందువులు ఎంతో ఆసక్తిగా భక్తిభావంతో ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. శ్రీరామ జన్మభూమి తీరథ్ క్షేత్ర ట్రస్ట్ వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన రామాలయం గర్భగుడి వద్ద రామ లల్లాను ప్రతిష్టించాలని నిర్ణయించారు. ఆలయ ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతున్న వేళ గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని వజ్రాల వ్యాపారి డైమెండ్ నక్లెస్ ను తయారు చేయించారు. అయోధ్య రామాలయం థీమ్ తో తయారు చేసిన ఈ డైమండ్ నక్లెస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : Ayodhya Ram temple : అయోధ్య రామ మందిరం ప్రారంభానికి చిరంజీవి, అమితాబ్, రజనీలతో పాటు.. ప్రముఖులకు ఆహ్వానం

ఈ డైమెండ్ నక్లెస్ కోసం సుమారు 5వేల అమెరికన్ వజ్రాలను వాడారు. దాదాపు రెండు కేజీల వెండితో ఈ నక్లెస్ ను రూపొందించారు. సూరత్ కు చెందిన రసేష్ జ్యువెలర్స్ ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించింది. 35రోజుల్లో 40 మంది కళాకారులు దీన్ని పూర్తి చేశారు. అయోధ్య రామాలయానికి బహుమతిగా ఈ డైమండ్ నక్లెస్ ను ఇవ్వనున్నట్లు వజ్రాల వ్యాపారి తెలిపారు. ఈ నక్లెస్ లో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుని విగ్రహాలు, రామ్ దర్బార్ తో పాటు జింకలు ఉన్నాయి.

Also Read : Ayodhya Ram temple : రామమందిరం నిర్మాణంతో అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు

వచ్చే ఏడాది జనవరి 22న భారీ వేడుకల మధ్య భక్తులకోసం రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 6వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. జనవరి 14 నుంచి జనవరి 22 వరకు అయోధ్య అమృత మహోత్సవ్ ను సూచిస్తుంది.