Gujarat Mysterious Metal Balls : మూడు రోజులుగా ఆకాశం నుంచి పడుతున్న మెటల్ బాల్స్‌…!! భయాందోళనలో స్థానికులు

గుజరాత్ లోని గ్రామాలపై గత మూడు రోజులుగా పంట పొలాల్లో వెండి రంగులో ఉన్న లోహపు బంతులు (Mysterious metal balls) పడుతున్నాయి. వాటిని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అవేంటో తెలియక..దీనికి కారణం ఏమై ఉంటుందో తెలియక భయాందోళనలకు గురి అవుతున్నారు.

Gujarat Mysterious metal balls :  గుజరాత్ లోని గ్రామాలపై గత మూడు రోజులుగా పంట పొలాల్లో వెండి రంగులో ఉన్న లోహపు బంతులు (Mysterious metal balls) పడుతున్నాయి. వాటిని చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అవేంటో తెలియక..దీనికి కారణం ఏమై ఉంటుందో తెలియక భయాందోళనలకు గురి అవుతున్నారు.గుజరాత్‌లో సురేంద్ర నగర్ జిల్లా సైలా గ్రామంలోని పంటపొలాల్లో చెల్లా చెదురుగా పడి ఉన్న వింత వస్తువులను గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోతున్నారు. అవేంటో తెలియక గందరగోళనానికి గురి అవుత తలలు పట్టుకుంటున్నారు. గత మూడు రోజులుగా నలుపు, సిల్వర్‌ రంగులో ఉన్న మెటల్‌ బాల్స్‌ ఆకాశం నుంచి పంటపొలాల్లో పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఖేడా జిల్లాలోని ఉమ్రేత్, నాడియాడ్ గ్రామాలతోపాటు ఆనంద్ జిల్లాలోని మూడు గ్రామాలలో ఆకాశం నుంచి ఇటువంటి మెటల్ బాల్స్ పడ్డాయి.

మే 12న ఆనంద్‌ జిల్లాలోని భలేజ్, ఖంభోల్జ్, రాంపుర గ్రామాల్లో కూడా ఆకాశం నుంచి ఈ మిస్టరీ బంతుల శకలాలు రాలి పడ్డాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. భలేజ్‌ ప్రాంతంలో గురువారం (మే 12,2022) సాయంత్రం 4.45 గంటలకు ఐదు కేజీల బరువున్న నల్ల రంగులోని మెటల్‌ బాల్‌ పడింది. ఖంభోల్జ్, రాంపుర గ్రామాల్లో కూడా ఇలాంటివి ఆకాశం నుంచి పడ్డాయి. ఈ మూడు గ్రామాలు 15 కిలోమీటర్ల పరిధిలోని ఉన్నాయి.

ఇలా మెటల్ బాల్స్ పడటంతో భయపడుతున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అవి పడిన ప్రాంతాలకు పోలీసు అధికారులు హుటాహుటిన తరలివచ్చి వాటిని పరిశీలించారు. అవి బహుశా శాటిలైట్‌ వ్యర్థాలు అయి ఉండవచ్చని బావిస్తున్నారు.
ఈ ఘటనలపై ఆనంద్‌ జిల్లా ఎస్పీ అజిత్ రాజియన్ మాట్లాడుతూ..ఇవి మెట్ బాల్స్ లా ఉన్నాయని..కానీ వీటి వల్ల ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని తెలిపారు. ఖంభోల్జ్ లో ఒక ఇంటికి సమీపంలో, మరో రెండు చోట్ల బహిరంగ ప్రదేశాల్లో ఆకాశం నుంచి లోహపు బంతులు పడినట్లుగా గుర్తించామని తెలిపారు.ఈ మిస్టరీ బాల్స్ పై దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులను పిలిపించామని వెల్లడించారు.

మరోవైపు గుజరాత్‌లోని మూడు జిల్లాల్లో ఆకాశం నుంచి రాలిపడుతున్న అంతరిక్ష వ్యర్థాలను పరిశీలించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నిపుణుల రంగంలోకి దిగారు. దేశ అంతరిక్ష డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఈ ప్రభుత్వ లాబొరేటరీ, స్పేస్ సైన్స్‌పై పరిశోధనలు చేస్తుంది.

మొదట్లో ఆ వస్తువులు ఏమిటో తమకు తెలియదని, మూడు ప్రదేశాలలో జనం గుమిగూడారని, అయితే అవి గురుత్వాకర్షణ శక్తి లేని సమయంలో అంతరిక్షంలో ఉపగ్రహం యొక్క వేగాన్ని కొనసాగించడానికి ఉపయోగించే బాల్ బేరింగ్‌లుగా అనిపించిందని ఎస్పీ రాజయాన్ చెప్పారు.

కాగా 2022 ఏప్రిల్‌లో మహారాష్ట్రలో ఆకాశంలో “ఉల్క” కనిపించిన తర్వాత ఇలాంటి సంఘటన జరిగింది. శబ్ధం విమానం లాగా వినిపించడంతో పెద్ద పేలుడు సంభవించింది. కాలిపోయిన వస్తువులు న్యూజిలాండ్‌లో ప్రయోగించిన ఉపగ్రహ శకలాలు అని తరువాత తేలింది. వియత్నాం, స్పెయిన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా మరియు టర్కీలోని యెన్ బాయిలో జనవరి 2016లో ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు