Amarinder Singh : ఇద్దరిది ఒకే పేరు కావడంతో పొరపాటు.. మీకు దండం ఆపండహే’ అంటూ గోల్‌కీపర్‌ రిక్వెస్ట్‌

సెలెబ్రిటీలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ సోషల్ మీడియా ద్వారా ఏదైనా సమాచారం తెలియచేయాలంటే వారికి ట్యాగ్ చేస్తుంటాం. ఈ ట్యాగ్ చేసే సమయంలో కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతాయి.

Amarinder Singh : సెలెబ్రిటీలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ సోషల్ మీడియా ద్వారా ఏదైనా సమాచారం తెలియచేయాలంటే వారికి ట్యాగ్ చేస్తుంటాం. ఈ ట్యాగ్ చేసే సమయంలో కొన్ని సార్లు పొరపాట్లు జరుగుతాయి. ఒకరికి ట్యాగ్ చేయబోయి అదే పేరుతో ఉన్న మరొకరికి ట్యాగ్ చేస్తుంటారు కొందరు. ఇలా చేస్తే సమాచారం అందచేయాలనుకునే వారికి కాకుండా ఎవరో అనామకులు వెళ్తోంది. దీంతో అదేంటో అర్ధం కాకా వారు తలలు పట్టుకుంటారు. అయితే తాజాగా అదే జరిగింది.

Read More : Galla Jayadev : ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబంపై భూ ఆక్రమణ కేసు

ప్రస్తుతం పంజాబ్‌ రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజీనామా అనంతర పరిణామాలు ఆసక్తిగా మారాయి. అయితే ఈ వ్యవహారంలోకి సంబంధం లేని వ్యక్తి పేరు తెర మీదకు రాగా.. అది సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. అమరీందర్‌ సింగ్‌.. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీం గోల్‌ కీపర్‌. అయితే ఈ అమరీందర్‌ సింగ్‌ను.. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌గా పొరపడి మీడియా ఛానెల్స్‌, వెబ్‌సైట్లు, నెటిజన్స్‌ ఎగబడి ట్విటర్‌లో ట్యాగ్‌ చేస్తున్నారట.

Read More : Punjab Crisis: బీజేపీలో చేరట్లేదు.. కాంగ్రెస్‌లో ఉండను.. ఆప్ ప్రభావం పెరిగింది – మాజీ సీఎం

దీంతో రియాక్ట్ అయ్యాడు గోల్‌ కీపర్‌ అమరీందర్‌ సింగ్‌. దయచేసి ట్యాగ్‌ చేయడం ఆపండంటూ మీడియా హౌజ్‌లకు రిక్వెస్ట్‌లు చేశాడాయన. తాను గోల్ కీపర్ అమరీందర్ సింగ్ అని.. మాజీ సీఎం కాదని తెలిపారు. అమరీందర్ ట్విట్ పై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. మీరు ఫుట్ బాల్ టీమ్ క్యాప్టెన్ అయ్యింటే సరిగ్గా సరిపోయేది ఒకరు.. రాజకీయ ప్రయత్నాలు మొదలు పెట్టమని మరొకరు రీట్వీట్స్ చేస్తున్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు