Punjab Crisis: బీజేపీలో చేరట్లేదు.. కాంగ్రెస్‌లో ఉండను.. ఆప్ ప్రభావం పెరిగింది – మాజీ సీఎం

ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడానికి ముందు.. రాజీనామా చేసిన తర్వాత కూడా పంజాబ్ కాంగ్రెస్‌లో రచ్చ జరుగుతోంది.

Punjab Crisis: బీజేపీలో చేరట్లేదు.. కాంగ్రెస్‌లో ఉండను.. ఆప్ ప్రభావం పెరిగింది – మాజీ సీఎం

Amarindhar

Punjab Congress Crisis: ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడానికి ముందు.. రాజీనామా చేసిన తర్వాత కూడా పంజాబ్ కాంగ్రెస్‌లో రచ్చ జరుగుతోంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రస్తుతానికి బీజేపీలో చేరట్లేదు కానీ, త్వరలో కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నట్లు ఓ  నేషనల్ మీడియా ఛానెల్‌తో చెప్పారు. అమరీందర్ సింగ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంతో హస్తినలో పంజాబ్ రాజకీయాలపై చర్చ జోరుగా సాగింది. రాజకీయాల్లో అమరీందర్ సింగ్ భవిష్యత్తు గురించి ఊహాగానాలు తీవ్రమయ్యాయి.

అయితే, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర(MSP) హామీ ఇవ్వాలని గత 10 నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళనను పరిష్కరించాలని హోంమంత్రిని అభ్యర్థించినట్లు అమరీందర్ సింగ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత సింగ్.. తాను రాజకీయాలను విడిచిపెట్టలేదని, చివరివరకు పోరాడతానని పేర్కొనడంతో రాజకీయంగా ఇంకా యాక్టీవ్‌గా అమరీందర్ ఉంటారని స్పష్టం అయ్యింది. అయితే, కెప్టెన్‌కి బీజేపీ రెండు ఆప్షన్లు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

భారతీయ జనతా పార్టీలో చేరాలా? వద్దా? అనే విషయాన్ని కెప్టెన్‌కే వదిలేసింది. కెప్టెన్‌కు మాత్రం డోర్లు తెరిచి ఉంచినట్లు బీజేపీ చెబుతోంది. పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్‌కు బీజేపీ సపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అమిత్ షా, కెప్టెన్ అమరీందర్ దాదాపు 45 నిమిషాలు సమావేశమయ్యారు. కాంగ్రెస్‌లో తనకు అవమానం జరిగిందని ఆరోపిస్తూ అమరీందర్ సింగ్ ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ చరంజిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా చేసింది. చన్నీ సీఎం అయిన తర్వాత, పంజాబ్ కాంగ్రెస్ యుద్ధం ముగిసినట్లు అనిపించింది.

కానీ రెండు రోజుల క్రితం నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సిద్ధూ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఆప్ పార్టీలో సిద్ధూ చేరే విషయమై కేజ్రీవాల్ మాత్రం ఇప్పటివరకు సిద్ధూ చేరికపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అయితే, అమరీందర్ చెప్పిన వివరాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం బాగా పెరిగిపోయిందని, కాంగ్రెస్ ప్రభావం 20శాతం తగ్గిపోయిందని చెప్పారు. ఈ సర్వే ఆగస్ట్‌లో కాంగ్రెస్ పార్టీ చేయించిందని చెప్పారు.