Galla Jayadev : ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబంపై భూ ఆక్రమణ కేసు

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబంపై భూ ఆక్రమణ కేసు నమోదు అయింది. ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారితో పాటు గల్లా రామచంద్రనాయడుతో సహా 12 మందిపై కేసు నమోదు చేశారు.

Galla Jayadev : ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబంపై భూ ఆక్రమణ కేసు

Galla Jayadev

Updated On : September 30, 2021 / 3:36 PM IST

land grab case registered : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబంపై భూ ఆక్రమణ కేసు నమోదు అయింది. ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారితో పాటు గల్లా రామచంద్రనాయడుతో సహా 12 మందిపై కేసు నమోదు చేశారు. తవణంపల్లి మండలం దిగువమాఘం గ్రామానికి చెందిన గోపి కృష్ణ అనే వ్యక్తి కోర్టులో ప్రైవేట్ కేసు వేయడంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

దిగువమాఘానికి చెందిన రైతు గోపి కృష్ణ తన పొలాన్ని గల్లా కుటుంబం రాజన్న ట్రస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో భూ ఆక్రమణలకు పాల్పడిందంటూ గోపి కృష్ణ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన చిత్తూరు నాలుగో అదనపు కోర్టు వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గల్లా కుటుంబంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Chiranjeevi : రాజమండ్రికి చిరంజీవి.. ఇందుకేనా??

గల్లా అరుణకుమారి తండ్రి దివంగత రాజగోపాల్ నాయుడు పేరుతో ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషన్ సొసైటీల కోసం దిగువమాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని ఆక్రమించి, పెద్ద ఎత్తున కాంపౌండ్ వాల్ నిర్మించారని అదే గ్రామానికి చెందిన రైతు గోపి కృష్ణ ఆరోపించారు. తన భూమి కోసం 2015 నుంచి వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో 2 నెలల క్రితం ఆయన కోర్టును ఆశ్రయించారు.