Chiranjeevi : రాజమండ్రికి చిరంజీవి.. ఇందుకేనా??

 ప్ర‌స్తుతం ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి రేపు అంటే అక్టోబ‌ర్ 1న రాజ‌మండ్రికి వెళ్లనున్నారు. ఇటీవల పవన్ స్పీచ్

Chiranjeevi : రాజమండ్రికి చిరంజీవి.. ఇందుకేనా??

Chiranjeevi

Chiranjeevi :  ప్ర‌స్తుతం ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి రేపు అంటే అక్టోబ‌ర్ 1న రాజ‌మండ్రికి వెళ్లనున్నారు. ఇటీవల పవన్ స్పీచ్, దానిపై సినీ, రాజకీయ నాయకుల వ్యతిరేకత, నిన్న ఏపీ మంత్రితో సినీ నిర్మాతల మీటింగ్, ఏపీలో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ పర్యటనలు వీటన్నిటి నేపథ్యంలో రేపు చిరంజీవి రాజమండ్రికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

కానీ చిరంజీవి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న డాక్టర్‌ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాలకు వెళ్తున్నట్టు సమాచారం. ఈ హోమియో వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన‌ హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మెగాస్టార్‌ చిరంజీవి రాజమండ్రికి వెళ్తున్నారు.

Tollywood : తమిళ్ హీరో వర్సెస్ తెలుగు హీరో

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆవిష్క‌ర‌ణ కార్యక్ర‌మంలో చిరంజీవి గత కొద్దీ రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఏమైనా వ్యాఖ్య‌లు చేస్తారా లేదా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా నిన్న సినీ నిర్మాత‌లతో సమావేశం అనంత‌రం ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై చిరంజీవి కూడా తనతో మాట్లాడరని, ఆడియో ఫంక్షన్‌లో జరిగిన పరిణామాలతో పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారని తెలిపారు.