Tollywood : తమిళ్ హీరో వర్సెస్ తెలుగు హీరో

కొన్ని రోజుల క్రితమే దిల్ రాజు ప్రొడక్షన్ లో తమిళ్ స్టార్ హీరో విజయ్ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ఇది విజయ్ కి 66వ సినిమా.

Tollywood : తమిళ్ హీరో వర్సెస్ తెలుగు హీరో

Nani

Tollywood :  ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు విలన్స్ గా కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మరో తెలుగు హీరో కూడా విలన్ గా మారబోతున్నాడు. ఇప్పటికే ‘వి’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించిన నాని ఇప్పుడు పూర్తి స్థాయి విలన్ గా రాబోతున్నట్టు సమాచారం.

కొన్ని రోజుల క్రితమే దిల్ రాజు ప్రొడక్షన్ లో తమిళ్ స్టార్ హీరో విజయ్ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు. ఇది విజయ్ కి 66వ సినిమా. ఈ సినిమాని ఒకేసారి తెలుగు తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఉన్న విలన్ రోల్ కోసం మన న్యాచురల్ స్టార్ నానిని సంప్రదించినట్టు సమాచారం. నాని ‘వి’ సినిమాలో చేసిన నటనని చూసి డైరెక్టర్ వంశీ విజయ్ సినిమా కోసం విలన్ రోల్ అడిగారని సమాచారం. నాని ఇంకా సమాధానం చెప్పకపోయినప్పటికీ కచ్చితంగా ఈ ప్రాజెక్టులో విలన్ గా చేస్తాడని అనుకుంటున్నారు. ఇప్పటికే ‘వి’ సినిమాలో విలన్ షేడ్ లో అదరగొట్టిన నాని పూర్తి స్థాయి విలన్ చేస్తారని సమాచారం.

Tollywood : టాలీవుడ్ లో విషాదం.. సినిమా పై కలలు.. అంతలోనే ఆత్మహత్య..

ఈ సినిమా చేయడం వల్ల నానికి తమిళ్ మార్కెట్ కూడా యాడ్ అవుతుంది. అంతే కాకుండా తమిళ్ స్టార్ హీరో విజయ్ కి ప్రతి నాయకుడి క్యారెక్టర్ అంటే నానికి ప్లస్ అవుతుందనే చెప్పొచ్చు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ అక్టోబర్ 27 నుంచి మొదలవ్వనుంది.