Tollywood : టాలీవుడ్ లో విషాదం.. సినిమా పై కలలు.. అంతలోనే ఆత్మహత్య..

టాలీవుడ్‌లో కరోనా వచ్చిన తర్వాత నుంచి ఎన్నో విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత సంవత్సర కాలంలో ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడి మరణించారు. చాలా సినిమాలు ఆగిపోయాయి. సినీ

Tollywood : టాలీవుడ్ లో విషాదం.. సినిమా పై కలలు.. అంతలోనే ఆత్మహత్య..

Su

Tolywood :  టాలీవుడ్‌లో కరోనా వచ్చిన తర్వాత నుంచి ఎన్నో విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత సంవత్సర కాలంలో ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడి మరణించారు. చాలా సినిమాలు ఆగిపోయాయి. సినీ కార్మికులు షూటింగ్స్ లేక ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నారు. ఒక‌రి మృతి విష‌యాన్ని మ‌ర‌చిపోక‌ముందే ఇంకొక‌రు మరణిస్తున్నారు. తాజాగా జూనియర్ ఆర్టిస్ట్‌ అనురాధ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది.

అనురాధ గత కొన్ని సంవత్సరాలుగా సీరియల్స్ లలో, సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించేది. సినిమాపై ఎన్నో కలలతో తన ప్రయాణం ప్రారంభించింది. ఈ ప్రయాణంలో కిరణ్ అనే యువకుడితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కిర‌ణ్ త‌న‌ని పెళ్లి చేసుకుంటాడ‌ని అనురాధ భావించింది. దీంతో అనురాధ గత కొన్ని నెలలుగా అత‌నితోనే కలిసి సహజీవనం చేస్తుంది. కానీ ఇటీవ‌ల అత‌డు మరో యువ‌తిని ఎంగేజ్‌మెంట్ చేసుకోవ‌డంతో అనురాధ అత‌నితో తీవ్ర వాగ్వాదం పెట్టుకుంది. కిర‌ణ్ ఆమెపై గ‌ట్టిగా అరిచి వెళ్లిపోవ‌డంతో మ‌న‌స్తాపానికి గురై త‌న గ‌దిలో ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

Allu Arjun : అల్లు అర్జున్ తన వైఫ్ ని ఏమని పిలుస్తాడో తెలుసా??

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ 306, 509, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు