PM Narendra Modi: ‘బ్రిక్స్‌’ ఎవరికీ వ్యతిరేకం కాదు.. ఢిల్లీ వేదికగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం

ఢిల్లీలోని భారత మండపం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ 2026 వార్షిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)కీలక ప్రారంభోపన్యాసం చేశారు.

Narendra PM Modi sensational comments at 2026 BRICS summit in Delhi.

  • బ్రిక్స్ సదస్సులో మోదీ పిలుపు
  • గ్లోబల్ సౌత్ గళం పెరగాలి
  • ఐరాసలో తక్షణమే భద్రతా సంస్కరణలు

PM Narendra Modi: ఢిల్లీలోని భారత మండపం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ 2026 వార్షిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)కీలక ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంక్షోభాలు, భౌగోళిక ఉద్రిక్తతలకు పరిష్కారం చూపడంలో బ్రిక్స్ కూటమి చొరవ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ రక్షణ, ఆర్థిక వ్యవస్థల్లో కీలక మార్పులు వస్తున్న ఈ సమయంలో గ్లోబల్ సౌత్ దేశాలు కేవలం ఆదేశాలను పాటించేవిగా కాకుండా, ప్రపంచ నిబంధనలను నిర్దేశించే స్థాయికి ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు.

TGPSC: నిరుద్యోగులకు TGPSC బిగ్ షాక్.. 544 ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దు.. కమిషన్ కీలక ప్రకటన

గ్లోబల్ సౌత్ సత్తా చాటాలి:

ప్రస్తుత ప్రపంచ పాలనా నిర్మాణం ఒక పిరమిడ్‌లా ఉందని, నిర్ణయాధికారం కేవలం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని మోదీ విమర్శించారు. సంక్షోభాల్లో ముందుండే గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టి, వర్ధమాన దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.

సాంకేతిక సహకారం, మానవాభివృద్ధే లక్ష్యం:

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ స్పేస్, బయోటెక్నాలజీ వంటి కీలక రంగాల్లో బ్రిక్స్ సభ్యదేశాలు పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని కోరారు. బ్రిక్స్ కూటమి ఏర్పాటై రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా, ఈ వేదిక ఏ ఒక్క దేశానికీ వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. పాశ్చాత్య దేశాలకు స్పష్టమైన సందేశమిస్తూ, రాబోయే రోజుల్లో కొత్త సంస్కరణలతో ప్రపంచ శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.