తడబడ్డ రాహుల్ : నరేంద్ర…సారీ, నీరవ్ మోడీ

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 09:56 AM IST
తడబడ్డ రాహుల్ : నరేంద్ర…సారీ, నీరవ్ మోడీ

Updated On : March 13, 2019 / 9:56 AM IST

మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దేశంలో ఓ రకమైన భావజాలం ప్రచారం చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేంద్రప్రభుత్వం,ప్రధాని మోడీ దీనికి ప్రతినిధులుగా ఉన్నారని రాహుల్ ఆరోపించారు. చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీలో బుధవారం(మార్చి-13,2019) విద్యార్థినులతో మాట్లాడిన రాహుల్…ప్రధాని మోడీతో మాట్లాడి.. ఆయనను ప్రశ్నించే అవకాశం మీలో ఎంతమందికి వచ్చింది, విద్యారంగంపై ఆయన ప్రణాళికలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని మీలో ఎవరైనా అడిగారా, 3,000 మంది మహిళల మధ్య ఇలా నాలా నిలబడి మోడీ మాట్లాడుతుండగా మీరు ఎప్పుడైనా చూశారా? ఎవరి ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి ఆయన నాలా ఎప్పుడైనా ముందుకువచ్చారా?’ అని ప్రశ్నించారు.దేశంలో రెండు భావజాలాలు ఉన్నాయని, వారి భహావజాలాన్నే దేశం మొత్తం పాటించాలని కొందరు అనుకుంటున్నారని, దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని మరో భావజాలం ఉందన్నారు. దేశంలో భయానక వాతావరణం ఉండకూడదన్నారు.

కాంగ్రెస్ దేశ పరిస్థితులను మార్చుతుందని తెలిపారు. తన తల్లి తనకు ప్రేమ,మానవత్వాలను నేర్పిందన్నారు. చట్టం ప్రతి ఒక్కరికీ వర్తించాలని, అది వాద్రా అయిన సరే..ప్రధాని అయినా సరే..అంతేగానీ ఎవరిపై ప్రయోగిస్తే వారిపై కాదని రాహుల్ అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థిక రంగం తీవ్రంగా నస్టపోయిందని తెలిపారు. రాఫెల్ డీల్ ను విమానాల తయారీలో ఎలాంటి అనుభవం లేని అప్పగించారని,దీనిపై మోడీ మౌనం వహిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ సందర్భంగా రాహుల్ తడబడ్డారు. దేశ సంపదను దోచుకుని విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తల గురించి మాట్లాడుతున్న సమయంలో..దేశంలోని సంపదను దోచుకుంటున్న 15-17మంది అవినీతి వ్యాపారవేత్తలు.. నరేంద్రమోడీ లాంటివాళ్లు అనగానే అక్కడ ఉన్నవాళ్లందరూ ఒక్కసారిగా విజిల్స్,కేకలు వేశారు. ఇంతలోనే తేరుకున్న రాహుల్.. నరేంద్రమోడీ కాదు క్షమించాలి నీరవ్ మోడీ అని నవ్వుతూ క్లారిటీ ఇచ్చారు. నీరవ్ మోడీ భారత్ లో ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో చెప్పాలని ప్రశ్నించారు. బిజినెస్ ప్రారంభించడానికి ప్రభుత్వం కనుక 30 లక్షల లోన్ ఇస్తే మీరు అధికసంఖ్యలో ఉద్యోగాలు మీరు సృష్టించగలరని అక్కడున్న విద్యార్థినులను ఉద్దేశించి రాహుల్ అన్నారు.