సార్వత్రిక ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఒడిషా అధికార పార్టీ బిజు జనతా దళ్ కూడా ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు వెళ్తోంది.
సార్వత్రిక ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఒడిషా అధికార పార్టీ బిజు జనతా దళ్ (BJD) కూడా ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై వదంతులు గుప్పుమన్నాయి.
పట్నాయక్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, కనీసం నడిచే పరిస్థితి కూడా లేదంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలు సీఎం పట్నాయక్ ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసి సీఎం ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టేశారు. పట్నాయక్ కు వ్యాయామం చేయడం అలవాటు. ఆయన తన ఫిట్ నెస్ పట్ల ఎప్పుడు కేర్ తీసుకుంటారు.
Read Also : మేనిఫెస్టోలో కీలక అంశాలు చెప్పిన చంద్రబాబు
అలాంటి సీఎం అనారోగ్యానికి గురయ్యారంటూ పుకార్లు రావడంతో స్వయంగా 72ఏళ్ల పట్నాయక్ తన ఫిట్ నెస్ మంత్రాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. బిజెడీ పార్టీ రిలీజ్ చేసిన వీడియోలో.. పట్నాయక్.. బ్లాక్ టీ షర్ట్ వేసుకుని ఉన్నారు. చక్కగా జిమ్ లో కార్డియో నుంచి వెయిట్ లిఫ్ట్ చేస్తూ.. కసరత్తులు చేస్తూ కనిపించారు. తన నివాసంలో లైట్ జాగింగ్ చేస్తూ హుషారుగా ఉన్నారు.
వీడియో చివరిలో పట్నాయ్ మాట్లాడుతూ.. ఒడిషా ప్రజల కోసం ఎన్నికల పోరాటానికి సిద్ధమని పిలుపునిచ్చారు. ఒడిషాలో బిజెడీ ఐదోసారి అధికారపీఠం ఎక్కేందుకు చూస్తోంది. 2014 ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బిజెడీ 147 అసెంబ్లీ స్థానాలకు 117 స్థానాలను గెలుచుకుంది. లోక్ సభ లో పార్టీ నుంచి ( రాష్ట్ర 21 అసెంబ్లీ స్థానాలకు) 9 మంది ఉన్నారు.
Biju Janata Dal (BJD) releases video of Odisha CM Naveen Patnaik’s exercise regime. The CM says, “Getting ready to fight for the people of Odisha”. pic.twitter.com/C15SqZRvoJ
— ANI (@ANI) April 5, 2019