Uttarakhand CM : చిరిగిన జీన్స్.. సీఎం కామెంట్స్, మహిళల ఆగ్రహం, బిగ్ బి మనువరాలు అసంతృప్తి

ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

navyandra instragram

Navya Nanda : ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి ఆశ్చర్యం వేసిందని, ఈ వేషధారణతో ప్రజలను కలవడానికి వెళితే..సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నట్లు అంటూ ఆయన ప్రశ్నించడం పట్ల మహిళలు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన్ను ప్రశ్నిస్తూ..కౌంటర్ ఇస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఎంపీ ప్రియాంకా చతుర్వేది, కాంగ్రెస్ నేతలు, సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా..బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనువరాలు నవ్య నవేలి నందా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. టోన్డ్‌ జీన్స్‌ ధరించిన ఓ ఫొటోని ఇన్‌స్టా గ్రామ్ వేదికగా షేర్‌ చేసిన నవ్య అలాంటి దుస్తులు వేసుకోవడాన్ని తాను గర్వంగానే ఫీల్‌ అవుతానని తెలిపారు. తమ వస్త్రధారణ కంటే..ముందు మీ అభిప్రాయాలు, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నారు. అయితే..తర్వాత..ఆ పోస్టును డిలీట్ చేశారు. అప్పటికే ఆమె చేసిన పోస్టు నెట్టింట వైరల్ గా మారిపోయింది.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత..మంగళవారం డెహ్రాడూన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తీరత్ సింగ్ పాల్గొన్నారు. ఓ మహిళ రిప్డ్ జీన్స్ ధరించిందని, ఈమె ఒక ఎన్జీవోను సైతం నడుపుతోందని, ఇలాంటి దుస్తులు ధరించి..సమాజానికి ఏం సందేశం ఇస్తుందంటూ వివాదాస్పదా వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరథ్ సింగ్‌ రావత్‌ను బీజేపీ శాసన సభాపక్షం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా పని చేసిన త్రివేంద్ర సింగ్ రావత్.. తన పదవికి రాజీనామా చేశారు. సింగ్ ప్రస్తుతం ఎంపీగా పని చేస్తున్నారు. 2013-15 మధ్య ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్‌గా వ్యవహరించారు. గతంలో ఎమ్మెల్యేగానూ ఆయన పని చేశారు. ఉత్తరాఖండ్ తొలి విద్యాశాఖ మంత్రి తీరథ్ సింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. మరుసటి ఏడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు.