Sharad Pawar- KCR: మహారాష్ట్రలో దూకుడు పెంచిన బీఆర్ఎస్.. కేసీఆర్‌పై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో అధికారంలోఉన్న బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోనూ దూకుడు పెంచింది. ఇటీవల పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Sharad Pawar and Cm KCR

Sharad Pawar: తెలంగాణలో అధికారంలోఉన్న బీఆర్ఎస్ పార్టీ.. మహారాష్ట్రలోనూ దూకుడు పెంచింది. ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇప్పటికే పలు దఫాలుగా ఆ రాష్ట్రంలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న కేసీఆర్.. అక్కడి ప్రజలకు హామీల వర్షం కురిపించారు. దీనికితోడు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వస్థలమైన నాగ్‌పూర్‌లో గురువారం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్నికూడా ప్రారంభించారు. త్వరలో ముంబై, పూణె, ఔరంగాబాద్‌లలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు చెందిన ఇతర పార్టీల నేతలు ఇప్పటికే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

CM KCR: ధరణి వచ్చిన తర్వాత.. పైరవీలు, లంచాలు లేవు

ఇటీవల నాందేడ్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి సభకు ప్రజలు భారీసంఖ్యలో పాల్గొన్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ దూకుడుపై ఆ రాష్ట్రం రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే, సీఎం కేసీఆర్ తన బహిరంగ సభల్లో మహారాష్ట్రలోని అన్ని రాజకీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు. రైతులను, గిరిజనులను, దళితుల కష్టాలను ఇక్కడ పార్టీలు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

CM KCR : ఏపీలో కరెంట్ ఉండదు, తెలంగాణకు వలస వస్తున్నారు- సీఎం కేసీఆర్

మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ పార్టీ విస్తరణపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీటీమ్ పార్టీ అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలను మాత్రమే కేసీఆర్ టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోందని పవార్ అన్నారు. ఇది రాష్ట్రంలోని అధికార పార్టీ ప్లాన్‌లో భాగమేనని అనుమానం ఉందని అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు