లాక్‌డౌన్ టైంలో భర్తకొడితే 7217735372 కాల్ చేయండి. NCW ప్రారంభించిన వాట్సాప్ హెల్ప్‌లైన్‌ ఇది

  • Publish Date - April 11, 2020 / 05:10 AM IST

కరోనాను అడ్డుకోవడానికి లాక్‌డౌన్ పాటిస్తున్నారు. రోజుల తరబడి ఇంట్లోనే. ఇదే అసలు సమస్యగా మారింది. భర్త కొడుతున్నాడంటూ చాలామంది మహిళలు రిపోర్ట్ చేస్తున్నారు. గృహహింస కేసులు పెరుగుతుండటంతో జాతీయ మహిళా కమిషన్ ఓ వాట్సాప్ నెంబర్‌ను మహిళల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.

మార్చి 24 నుంచి ఏప్రిల్ 1వరకు మహిళలపై వివిధ నేరాలకు సంబంధించి 257 ఫిర్యాదులు వచ్చాయి.  257కేసుల్లో 69 గృహహింసకు సంబంధించినవే. అందుకే మహిళలకు, అమ్మాయిలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే 7217735372 నెంబర్‌కి మెసేజ్ చేస్తేచాలు. మిగిలిన పని తాము చూసుకొంటామని భరోసానిచ్చారు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖ శర్మ. 

ఈ నెంబర్ కి మెసేజ్ చేసి, ఫిర్యాదును నమోదు చేసుకొవచ్చు. లాక్‌డౌన్ అమలులో ఉన్నంత వరకు మాత్రమే ఈ నెంబర్ పనిచేస్తోంది. ఆ తర్వాత ఈ సేవ నిలిచిపోతుంది.