ND తివారి కొడుకు మృతి

  • Published By: madhu ,Published On : April 16, 2019 / 01:51 PM IST
ND తివారి కొడుకు మృతి

ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి, ఏపీ మాజీ గవర్నర్ దివంగత ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ శేఖర్ మృతి చెందాడు. సౌత్ ఢిల్లీ డీసీపీ విజయ్ కుమార్ మృతిని నిర్ధారించారు. ఢిల్లీలోని సాకేత్ మ్యాక్స్ ఆస్పత్రిలో చనిపోయినట్లు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. రోహిత్ శేఖర్ ఎలా చనిపోయాడనేది తెలియరావడం లేదు. ముక్కులో నుండి రక్తం కారుతుండడంతో చికిత్స కోసం సాకేత్ మ్యాక్స్ ఆస్పత్రికి వచ్చాడని ఢిల్లీ జాయింట్ పోలీసు కమిషనర్ శ్రీవాస్తవ వెల్లడించారు. అంబులెన్స్‌లో వచ్చాడని..అప్పటికే మృతి చెందాడని వైద్యులు వెల్లడించారని అన్నారు. 

రోహిత్ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఎన్డీ తివారి తన తండ్రే అంటూ చాలాకాలం పాటు ఆయన పోరాటం చేశారు. ఆరేళ్ల పాటు తివారీపై న్యాయస్థానంలో పోరాటం కొనసాగించారు. రక్తనమూనాలు, డీఎన్ఏ పరీక్షలకు తివారీ అప్పట్లో సహకరించలేదు. చివరకు రోహిత్ శేఖర్ తన కొడుకే అని తివారీ అంగీకరించాల్సి వచ్చింది. రోహిత్ శేఖర్ బయోలాజకల్ ఫాదర్ తివారీ అని డిఎన్ఎ పరీక్షల్లో తేలింది.