దీపావళి రోజున 70శాతం ఢిల్లీ వాసులు టపాసులు కాల్చలేదు

70 per cent of Delhiites didn’t burn firecrackers on Diwali ఈ ఏడాది దీపావళి రోజున ఢిల్లీలోని 70శాతంమంది టపాసులు లేదా బాణసంచా కాల్చలేదని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఆప్ ప్రభుత్వం తీసుకున్న ‘క్రాకర్స్ బ్యాన్’ నిర్ణయం వల్లే ఇది సాధ్యమైందని,వచ్చే ఏడాది ఇంతకన్నా మంచి ఫలితాలు వస్తాయని రాయ్ తెలిపారు. పొల్యూషన్ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం ఒక్కరోజులోనే కనుగొనబడటం సాధ్యం కాదని రాయ్ తెలిపారు.



కాగా,దేశ రాజధానిలో నవంబర్-30వరకు అన్నిరకాల ఫైర్ క్రాకర్స్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఈ నెల5న ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఢిల్లీలో నవంబర్-9 అర్థరాత్రి నుంచి నవంబర్-30 అర్థరాత్రి వరకు అన్నిరకాల టపాసుల అమ్మకం,వినియోగంపై విధించింది.



మరోవైపు, ఢిల్లీలో పొల్యూషన్ నియంత్రణలో భాగంగా ఢిల్లీ ప్రభుతం చేపట్టిన ‘రెడ్ లైట్ ఆన్ గాడీ ఆఫ్’ రెండో దశ క్యాంపెయిన్ ని ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎంతో కలిసి గోపాల్ రాయ్ ప్రారంభించారు. పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యవర్థాల దహనం కారణంగానే ఢిల్లీలో పొల్యూషన్ అధికమవుతుందని, పంటవ్యర్థాల దహనానికి దీర్ఘకాలిక పరిష్కారం “పుసా బయో-డీకంపోజర్” అని తెలిపారు.