Tokyo Javelin Throw : టోక్యో ఒలింపిక్స్ : జావెలిన్‌ త్రోలో ఫైనల్స్‌కు నీరజ్‌ చోప్రా

టోక్యో ఒలింపిక్స్ లో పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్​-ఏలో నీరజ్‌ చోప్రా ఫైనల్స్‌ కు చేరాడు. 86.65 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్‌కు చేరాడు.

Neeeraj Chopra

Tokyo Javelin Throw : టోక్యో ఒలింపిక్స్ లో పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్​-ఏలో నీరజ్‌ చోప్రా ఫైనల్స్‌ కు చేరాడు. గ్రూప్-ఏ విభాగంలో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. 86.65 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్‌కు చేరాడు. తొలి ప్రయత్నంలోనే అతను రికార్డు స్థాయిలో 86.65 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను విసిరాడు.

జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్స్‌కు చేరాలంటే 83.50 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను విసరాల్సి ఉంటుంది. లేదంటే తొలి 12 మందిలో నిలవాల్సి ఉంటుంది. అయితే నీరజ్ చోప్రా ఏకంగా 86 మీటర్లకు జావెలిన్‌ను విసరడంతో ఆటోమేటిక్‌గా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. అలాగే ఈ సీజన్‌లో అతనికి అత్యుత్తమ త్రో కావడం విశేషం.

ఇదిలావుంటే ఇదే గ్రూప్‌లో ఫిన్లాండ్‌కు చెందిన లస్సీ ఎటలాట 84.50 మీటర్ల త్రోతో నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఆ తర్వాత రొమేనియాకు చెందిన అలెగ్రాండ్రూ మిహైతో నోవాక్‌ 83.27 మీటర్లు విరిసి మూడోస్థానంలో నిలిచాడు.

స్వీడన్‌కు చెందిన కిమ్‌ అంబ్‌ 82.40 మీటర్లతో నాలుగో స్థానంలో, జర్మన్‌ లెజెండ్‌ జోహన్నెస్‌ వెట్టర్‌ 82.04తో ఐదో స్థానంలో నిలిచాడు. జావెలిన్‌ త్రో ఫైనల్‌ మ్యాచ్‌ ఈ నెల 7న జరుగనుంది.