నీట్-పీజీ ఎగ్జామ్ వాయిదా

దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Neet Pg Medical Entrance Exams Scheduled For April 18 Postponed

NEET-PG దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్-18న జరగాల్సి ఉన్న నీట్- పీజీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వాయిదా వేస్తున్నట్టు గురువారం(ఏప్రిల్-15,2021) కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా హర్షవర్థన్ ప్రకటించారు.

వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో యువ డాక్టర్లను దృష్టిలో పెట్టుకునే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అంతకంటే ముందుగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ పరీక్షలకు తమ పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తడం కూడా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణమైంది.

ఇక,కరోనా పరిస్థితిపై రివ్యూ చేసిన తర్వాత నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీని ప్రకటిస్తామని కేంద్రమంత్రి డా హర్షవర్థన్ స్పష్టంచేశారు. కాగా,నీట్-పీజీ ఎగ్జామ్ 2021 కోసం 1,74,886 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే చాలా మంది తమ అడ్మిట్ కార్డులు కూడా డౌన్‌లోడ్ చేసుకున్నారు.