NEET UG 2023 : లో దుస్తులు చూపించమన్నారు, బ్రా పట్టీలు చెక్ చేశారు.. విద్యార్థులకు చేదు అనుభవం

NEET UG 2023 : ప్యాంట్లు మార్చుకోవాలన్నారు. లో దుస్తులు చూపించాలన్నారు. బహిరంగ ప్రదేశంలోనే అబ్బాయిలతో కలిసి అమ్మాయిలు కూడా బట్టలు మార్చుకోవాల్సి వచ్చిందని విద్యార్థినులు వాపోయారు.

NEET UG 2023(Photo : Google)

NEET UG 2023 : నీట్ (నేషనల్ ఎల్జిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-NEET)2023 ఎగ్జామ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరీక్షకు హాజరైన కొందరు విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. ఎగ్జామ్ సెంటర్ దగ్గర తమ బ్రా పట్టీలను చెక్ చేశారని, లో దుస్తులను చూపించమని అడిగారని విద్యార్థినులు ఆరోపించారు. ఈ ఘటనలు మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ లో వెలుగుచూశాయి. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఒక అమ్మాయి కుర్తా వేసుకుని పరీక్షా కేంద్రానికి రాగా.. దాన్ని తీసి లోపల వేసుకోమని సిబ్బంది చెప్పారట. ఇక, కొంతమంది అభ్యర్థులు డ్రెస్ కోడ్ కోసం దగ్గరలోని షాపుల్లో బట్టలు కొనాల్సి వచ్చింది.

తమకు ఎదురైన చేదు అనుభవనాలను అభ్యర్థులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అనంతరం దీనిపై మేనేజ్ మెంట్ కు ఫిర్యాదు చేశారు. పరీక్షా కేంద్రాల సిబ్బంది మాత్రం తమ తప్పేమీ లేదంటున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్దేశించిన డ్రెస్ కోడ్‌ ను తాము అమలు చేస్తున్నామని వివరించారు. తాము కేవలం నిబంధనలను పాటించాము అని చెబుతున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్దేశించిన డ్రెస్ కోడ్‌ను అభ్యర్థులు పాటించడం లేదు, అందుకే చివరి నిమిషంలో దుస్తులను మార్చుకోవాల్సి వచ్చిందని అధికారులు చెప్పుకొచ్చారు.

Also Read..GPS Car : OMG.. ప్రాణాలకు మీదకు తెచ్చిన GPS, సముద్రంలోకి దూసుళ్లిన కారు.. షాకింగ్ వీడియో

ఇక హుగ్లీలో మరో దారుణం జరిగింది. విద్యార్థులు తమ ప్యాంట్లను మార్చుకోవాలి లేదా లో దుస్తులు తెరవమని అధికారులు కోరారని విద్యార్థులు ఆరోపించారు. ఎగ్జామ్ సెంటర్ చుట్టు పక్కల బట్టల దుకాణాలు లేకపోవడంతో బహిరంగ ప్రదేశంలోనే అబ్బాయిలతో కలిసి అమ్మాయిలు కూడా బట్టలు మార్చుకోవాల్సి వచ్చిందని విద్యార్థినులు వాపోయారు. ఈ ఆరోపణలపై హెచ్ఎంసీ ఎడ్యుకేషన్ సెంటర్ ప్రిన్సిపాల్ స్పందించారు. విద్యార్థులు చేసిన ఆరోపణలు ఆయన ఖండించారు. విద్యార్థులు డ్రెస్ కోడ్ ను పాటించలేదన్నారు. అందుకే డ్రెస్ చేంజ్ చేసుకోవాలని సూచించామన్నారు. ఇందులో తమ తప్పేమీ లేదన్నారు. తాము కేవలం నిబంధనలను ఫాలో అయ్యామని వివరణ ఇచ్చారు.

Also Read..Ghaziabad Manhole : షాకింగ్ వీడియో.. అంతా చూస్తుండగానే, నడుస్తూ నడుస్తూ మ్యాన్ హోల్‌లో ఎలా పడిపోయారో చూడండి

డ్రెస్ కోడ్ పేరుతో ఎగ్జామ్ సెంటర్ అధికారులు చేసిన రచ్చపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పందించింది. మహిళా అభ్యర్థులను పరీక్షించడంలో సున్నితత్వాలను గుర్తుంచుకోవాలని పరీక్షా కేంద్రాల సిబ్బందికి సమగ్ర సూచనలను జారీ చేస్తామని తెలిపింది.

కాగా, ఇలాంటి కారణాలతో నీట్ ఎగ్జామ్.. వార్తలకు ఎక్కడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ పలు చోట్ల విద్యార్థినులకు ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి.