Nagaland : పూరి గుడిసె నుండి బంగ్లా దాకా.. ఫోటోల్లో తన సక్సెస్ చూపించిన సివిల్ సర్వెంట్.. ఎవరంటే?
జీవితంలో విద్య, అంకిత భావం, కృషితో విజయం సాధించవచ్చని బి.నెల్లయప్పన్ చెబుతున్నారు. ఆయన షేర్ చేసిన ఫోటోల్లోనే ఆయన సక్సెస్‌ను చూపిస్తున్నారు. ఎవరాయన? చదవండి.

Nagaland
Nagaland : 30 ఏళ్ల వరకూ ఆయన పూరి గుడిసెలో నివసించారు. ఇప్పుడు జీవితం మొత్తం మారిపోయింది. ఇప్పుడు సీఎం దగ్గర స్పెషల్ డ్యూటీ చేస్తున్నారు. విశాలమైన బంగ్లాలో సకల సౌకర్యాలతో జీవితం. ఇదంతా ఊరికే రాలేదు. ఓ సివిల్ సర్వెంట్ సక్సెస్ అతను షేర్ చేసిన ఫోటోల్లోనే కనిపిస్తోంది. చదవండి.
చదువు జీవితాల్ని మార్చేస్తుంది. పేదరికం నుండి బయటపడేస్తుంది. కష్టపడి అంకిత భావంతో ముందుకు వెళ్తే చక్కని జీవితం చేతికి అందుతుంది. ఒక వ్యక్తి ఒకప్పుడు కొబ్బరి ఆకులు వేసిన పూరింట్లో పేదరికాన్ని అనుభవించి ఇప్పుడు రెండంతస్తుల బంగ్లాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. ఆయనే నాగాలండ్ సీఎం నైఫియు రియోకు స్పెషల్ డ్యూటీలో ఉన్న అధికారి బి.నెల్లయప్పన్. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
నెల్లయప్మపన్ ట్విట్టర్ ఖాతాలో (@nellayappan) షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన తన పోస్టులో విద్య జీవితాలను మార్చగలదని, పేదరికం నుండి బయటపడేస్తుందని చెప్పారు. అంకిత భావం ద్వారా ప్రజలు తమ జీవితాల్ని మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షించారు. తనకి 30 సంవత్సరాలు వచ్చే వరకూ తల్లిదండ్రులు, నలుగురు తోబుట్టువులతో పూరి గుడిసెలో నివసించామని.. విద్య, అంకిత భావం, కృషితో తాను ఈరోజు ఈ స్ధానానికి చేరుకోవడం నిజంగా ఆశీర్వాదమని నెల్లయప్పన్ షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల మనసు దోచుకుంది.
‘మీరు చాలా స్ఫూర్తి దాయకం.. మీ ఇల్లు ఎంతో అందంగా ఉంది’ ..’అభినందనలు.. ఈ రోజు చూసిన ఉత్తమమైన పోస్టు’ అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఈ పోస్టు వైరల్ అవుతోంది.
I lived in this single room thatched house (coconut leaf roof then) with my Parents & 4 Siblings till I was 30 years old.
Blessed to reach today’s position through Education, Dedication & Hard Work. pic.twitter.com/hLwFsmXaUl— Nellayappan B (@nellayappan) September 6, 2023