Delhi Metro : మెట్రోలో బరితెగించిన జంట..వాళ్లు చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్లు

మెట్రోలో కొందరి ఆగడాలు మితి మీరి పోతున్నాయి. ఢిల్లీ మెట్రోలో ఓ జంట బరి తెగించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన వారి ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Delhi Metro

Viral Video on Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఓ జంట విపరీత చేష్టలు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఆ జంట చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Metro Train : మెట్రోలో మంచూరియా తిన్న ప్రయాణీకుడు, షాకిచ్చిన యాజమాన్యం

మెట్రోలో కొందరి వెకిలి చేష్టలు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో ఓ జంట చాలా సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. ఓ యువతి కూల్ డ్రింగ్ సిప్ చేస్తూ అది తన బాయ్ ఫ్రెండ్‌కి షేర్ చేయడం వీడియోలో కనిపిస్తుంది. వీరి విపరీతమైన ప్రవర్తనకి ప్రయాణికులు షాక్‌కి గురయ్యారు. చాలా అసౌకర్యంగా కనిపించారు.

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో ఓ జంట పాడుపని.. వీడియో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు
@ShashikantY10 అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోకి ‘ఢిల్లీ మెట్రోను మూసివేయాలా? లేదంటే ఇది ఎంటర్టైన్‌మెంట్ అందించే ప్రదేశమా?’ అనే శీర్షికను యాడ్ చేసారు. చాలామంది నెటిజన్లు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మెట్రో ఎక్కడానికి అనుమతించకూడదని కామెంట్లు చేసారు.