Sania Mirza : ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయాలి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసేందుకు టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా వెళ్లడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Sania Mirza : ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయాలి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

Sania Mirza

Updated On : November 13, 2021 / 6:58 AM IST

Sania Mirza :  టీ20 ప్రపంచకప్2021లో పాకిస్తాన్ ఇంటిదారి పట్టింది. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసేందుకు టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా వెళ్లడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సానియా మీర్జా పౌరసత్వం రద్దు చేయాలని, ఆమెపై ఉపా చట్టం పెట్టి దేశ పౌరసత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడు.. ఆసీస్ ఆటగాళ్ల వికెట్లు తీసినప్పుడు చప్పట్లు కొడుతూ మద్దతు పలికింది.

చదవండి : T20 world cup 2021..Sania Mirza : షోయబ్ మాలిక్ సిక్సర్లు..సానియా చప్పట్లు..ఏకిపారేస్తున్న నెటిజన్లు

స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోను షోయబ్ మాలిక్ సిక్సర్లు కొడుతుంటే..స్టాండ్స్‌లో కూర్చుని సానియా మీర్జా చప్పట్లు కొడుతూ కనిపించింది. అప్పుడు కూడా నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. శత్రుదేశానికి సపోర్ట్ చేస్తున్నారని.. ఆమె పౌరసత్వం రద్దు చేయాలని ప్రధాని మోడీ, అమిత్ షాతోపాటు మరికొందరికి ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వైపు పాక్‌ పేసర్‌ హసన్‌ అలీ భార్యని, ఆమె కుటుంబ సభ్యులను కూడా పాకిస్తాన్‌ అభిమానులు ట్రోలింగ్‌ చేస్తున్నారు.

చదవండి : Sania Mirza: పాకిస్తాన్ క్రికెటర్‌ను ‘బావ గారూ..’ అంటున్న భారత్ ఫ్యాన్స్.. సానియా ఫుల్ హ్యాపీ!!