రమ్యపై నెటిజన్లు ఫైర్..తీసుకెళ్లి పాక్ లో వదిలిపెట్టండి

కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ చార్జి, మాజీ ఎంపీ రమ్య మరోసారి ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది. వాయుసేన మెరుపుదాడులకు సంబంధించి రమ్య చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.రమ్యపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి రమ్యను పాకిస్తాన్ లో తీసుకెళ్లి వదిలిపెట్టాలని, ఒకసారి పాక్ కు వెళ్లివచ్చిందిగదా అందుకే మైండ్ పోయిందంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. బజరంగీ భాయిజాన్ సినిమాలో హీరో సల్మాన్    చిన్నపిల్లను వీపుపై పెట్టుకుని పాక్ లోని ఆ చిన్నారి ఇంట్లో వదిలిపెట్టినట్లుగానే రమ్యను కూడా తీసుకెళ్లి పాక్ లో వదిలిపెట్టాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

సోమవారం(మార్చి-4,2016) ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశించి రమ్య చేసిన ఓ ట్వీట్ లో..మాకు భధ్రతా బలగాలపై నమ్మకముంది. వారిని చూసి చాలా గర్వపడుతున్నాం.మిమ్మల్ని మాత్రం మేము నమ్మడం లేదు. వారికి క్రెడిబుల్ ట్రాక్ రికార్డు ఉంది. స్వాతంత్ర్యం పొందినరోజు నుంచి అనేక యుద్ధాల్లో పోరాడాడి మనల్ని గెల్చుకున్నారు. మీరు మాత్రం దానికి విరుద్ధంగా సందేహాస్పదమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నారు. ప్రతిదానిపై మీరు అబద్దాలు చెబుతూనే ఉన్నారు.ప్రజలను తప్పుదోవ పట్టిస్తూనే ఉన్నారని ట్వీట్ చేశారు. రమ్య ట్వీట్ పై ఫైర్ అయిన నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను చెడుగుడు ఆడేసుకుంటున్నారు. గతంలో కూడా రమ్య పాక్ కు అనుకూలంగా మాట్లాడిందని, వెంటనే బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్ లో రమ్య గారిని ఇస్లామాబాద్ లో వదిలిపెట్టాలంటూ ఫన్నీగా పోస్ట్ లు పెడుతున్నారు.