Sia
State Investigation Agency జమ్ముకశ్మీర్ యంత్రాంగం కొత్త యాంటీ టెర్రరిజం బాడీని ఏర్పాటు చేసింది. కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాద సంబంధిత కేసులను మరింత సమర్థవంతంగా, వేగంగా దర్యాప్తు చేపట్టేందుకు స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(SIA) ఏర్పాటుకు సోమవారం జమ్ముకశ్మీర్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)సహా కేంద్ర దర్యాప్తు సంస్థలకు..SIA నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో ఇకపై ఉగ్రవాద సంబంధిత కేసులను పోలీసులు నమోదు చేస్తే ఆ సమాచారాన్ని SIAకు అందించాల్సి ఉంటుంది.
ఉగ్ర సంబంధిత కేసుల దర్యాప్తును NIA చేపట్టకపోతే.. ఆ కేసు విచారణపై జమ్ముకశ్మీర్ పోలీస్ యంత్రాంగం,SIA చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం పేర్కొంది. కేసు ఎవరికి అప్పగించాలనే విషయంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం డీజిపీకే ఉంటుందని స్పష్టం చేసింది. SIAకి కేసు బదిలీ కాని పక్షంలో ఆ దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఎస్ఐఏకు అందిస్తూ ఉండాలని తెలిపింది. అవసరమైతే ఎస్ఐఏ కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపట్టవచ్చని తెలిపింది. SIA కి సీఐడీ విభాగ అధిపతి ఎక్స్-అఫీషియో డైరెక్టర్గా వ్యవహరించనున్నారు.
ALSO READ CM Jagan : మరింత మంచి చేస్తా.. బద్వేల్ ఫలితంపై సీఎం జగన్ స్పందన