CM Jagan : మరింత మంచి చేస్తా.. బద్వేల్ ఫలితంపై సీఎం జగన్ స్పందన

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90 వేలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. బద్వేల్ లో అఖండ విజయాన్ని

CM Jagan : మరింత మంచి చేస్తా.. బద్వేల్ ఫలితంపై సీఎం జగన్ స్పందన

Cm Jagan Badvel

CM Jagan : సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. రికార్డు మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ గెలుపొందారు. అదీ సీఎం జగన్ కు పులివెందులలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. బద్వేల్ ఫలితంపై సీఎం జగన్ స్పందించారు.

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ 90 వేలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. బద్వేల్ లో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా అంటూ ట్వీట్ చేశారు.

Diabetes : షుగర్ వ్యాధి గ్రస్తులు తీపిపదార్ధాలు తింటే ప్రమాదమా?..

“శాసనసభ్యురాలిగా గెలుపొందిన డాక్టర్ సుధమ్మకు అభినందనలు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఈ ఘనవిజయం దక్కింది. ఈ గెలుపును ప్రజా ప్రభుత్వానికి, సుపరిపానలకు మీరిచ్చిన దీవెనగా భావిస్తాను… ఈ క్రమంలో మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను” అని సీఎం జగన్ చెప్పారు.

WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

బద్వేల్ ఉప ఎన్నికలో వార్ వన్ సైడ్ అయ్యింది. ఫ్యాన్ గాలి జోరులో బీజేపీ, కాంగ్రెస్ కొట్టుకుపోయాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. వైసీపీ పెద్దలు కూడా ఊహించని మెజార్టీని సుధ సొంతం చేసుకున్నారు. మొదటి రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకూ భారీగా ఆధిక్యంలోనే కొనసాగిన వైసీపీ అభ్యర్థి చివరికి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సురేష్‌పై 90,533 ఓట్ల భారీ మెజార్టీతో సుధ గెలుపొందారు.

మొత్తం 13 రౌండ్లు ముగిసే సరికి వైసీపీకి 1,12,211, బీజేపీకి 21,678, కాంగ్రెస్‌కు 6,235, నోటాకు 3,650 ఓట్లు పోలయ్యాయి. వైఎస్ జగన్ మెజార్టీ రికార్డ్‌ను అదే జిల్లాకు చెందిన బద్వేల్ అభ్యర్థి బ్రేక్ చేశారు. 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్.. టీడీపీ అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డి పై 90వేల 110 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ రికార్డ్‌ను బద్వేల్‌ వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ బ్రేక్ చేశారు. 90వేల 533 ఓట్ల మెజార్టీతో సుధ గెలుపొందారు. కాగా, గ‌త‌ ఎన్నిక‌ల్లో దాస‌రి సుధ‌ భ‌ర్త వెంక‌ట సుబ్బ‌య్య ఇదే బ‌ద్వేలు నుంచి 44వేల 734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో దాసరి సుధ రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొందడం విశేషం.