ఒంటె కన్నీటికి అసాధారణ శక్తి.. పాము విషం విరుగుడుకు అద్భుత ఔషధం..! శాస్త్రవేత్తల పరిశోధనల్లో సంచలన విషయాలు..

దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లేబొరేటరీలోని శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం చేసింది.

ఒంటె కన్నీటికి అసాధారణ శక్తి.. పాము విషం విరుగుడుకు అద్భుత ఔషధం..! శాస్త్రవేత్తల పరిశోధనల్లో సంచలన విషయాలు..

Rajasthan Camel

Updated On : July 6, 2025 / 11:54 AM IST

Camel Teardrop: ఇసుక తుపాన్లు, చుక్క నీరులేని ఎడారి ప్రాంతం, ఒళ్లు కాలి మండిపోయేంత ఎండ.. ఇలా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ అవలీలగా బతికే గుణం ఒంటెకు ఉంటుంది. అదే సమయంలో ఒంటె కన్నీటికి అసాధారణ శక్తి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒంటె కన్నీటి చుక్క 26 రకాల పాముల విషాలనుసైతం తట్టుకునేంత అద్భుతమైన శక్తిసామర్థ్యాలను కలిగి ఉందని పరిశోధనల్లో తేలింది.

Also Read: బుమ్రాను క్యూట్‌గా చూస్తూ మురిసిపోతున్న ఈ యంగ్‌లేడీ ఎవరో తెలుసా.. భారత్ జట్టు డ్రెస్సింగ్ రూంలో ఆమె పాత్ర ఏంటంటే?

దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లేబొరేటరీలోని శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం చేసింది. పాముకాటు విరుగుడు మందు తయారీలో ఒంటె కన్నీటి నుంచి సేకరించిన పోషకాలు అక్కరకొస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. బ్యాక్టీరియా కణ గోడలను ధ్వంసం చేసి వాటిని చంపేసే రోగ నిరోధక శక్తి ఉండే ప్రొటీన్లు ఒంటె కన్నీటి చుక్కలో పుష్కలంగా ఉన్నాయని తేల్చారు. ఒంటె కన్నీటితో శక్తివంతమైన పాముకాటు విరుగుడు మందును తయారు చేయొచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు.

సన్ననవి ఇసుక రేణువుల గాలిలో ఏళ్లతరబడి గడిపిన కారణంగా ఒంటె కన్నీటిలో సహజంగానే కంటి సంబంధ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి ఉంటుందని, ఆ కోణంలో పరిశోధనలు జరిపి ఈ కొత్త విషయాన్ని కనుక్కోవటం జరిగిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఒంటె కన్నీళ్లలో పాము కాటును తట్టుకునే యాంటీబాడీలు అధికంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని చెప్పారు.

అయితే, ప్రపంచ స్థాయిలో అన్ని రకాల పాముల విషాలకు ఒంటె కన్నీరు ఏ స్థాయిలో ప్రతిస్పందిస్తుంది అనేది ఇంకా తేలాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దుబాయ్, బికనీర్‌లో జరిగిన స్థాయిలో అన్ని చోట్లా పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తే విరుగుడు మందు తయారీలో కొత్త అధ్యయనం మొదలైనట్లేనని పరిశోధకులు చెప్పారు.