వధూవరులకు కరోనా : గ్రామానికి రాకపోకలు బంద్

కరోనా ఎంతో మందికి షాక్ ఇస్తోంది. జీవితాలను ప్రభావితం చేస్తోంది. భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివాహాలపై కూడా పెను ప్రభావం చూపెట్టింది. వేల పెళ్లిళ్లు ఆగిపోయాయి. కొంతమంది నిరాడంబరంగా వివాహాలు చేసుకున్నారు. వధూవరులకు షాక్ ఇస్తోంది. తాజాగా పెళ్లి చేసుకున్న జంటకు కరోనా షాక్ ఇచ్చింది. వధూవరులిద్దరికీ కరోనా పాజిటివ్ రావడంతో…దీంతో అందరూ షాక్ తిన్నారు. ఇంకేముంది వారి ఫ్యామిలీని క్వారంటైన్ కు తరలించారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివాహ వేదికను సీజ్ చేశారు.

యూపీలోని చత్తర్ పూర్ యువతితో రాజస్థాన్ కు చెందిన యువకుడికి వివాహం జరిగింది. 2020, మార్చి 23వ తేదీన ఈ పెళ్లి జరిగింది. ఈ సమయంలో కరోనా వ్యాపిస్తుండడంతో లాక్ డౌన్ విధించారు. దీంతో వీరందరూ చిక్కుకపోయారు. చివరకు 2020, ఏప్రిల్ 14వ తేదీన రాజస్థాన్ కు పయనమయ్యారు. వీరు నాలుగు రోజుల పాటు ప్రయాణించారు. రాజస్థాన్ సరిహద్దుల వద్ద పోలీసులు ఆపి తనిఖీలు నిర్వహించారు. అందరికీ పరీక్షలు నిర్వహించారు. వధూవరులకు కరోనా పాజిటివ్ తేలింది. పెళ్లి జరిగిన చత్తర్ పూర్ గ్రామాన్ని పూర్తిగా మూసివేశారు. వీరి కుటుంబీకులను క్వారంటైన్ కు తరలించారు. ఆ ప్రాంతాన్ని అంతా శానిటైజ్ చేశారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.