Newly Married Woman Dies : పెళ్లై 15రోజులు.. నవ వధువు మృతి.. బైక్‌పై వెళ్తుండగా ఘటన..

Newly Married Woman Dies : కర్ణాటకలోని మైసూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి జరిగిన 15రోజుల్లోనే నవ వధువు మృతిచెందింది. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

Newly Married Woman Dies Husband Injured in karnataka road accident

Newly Married Woman Dies : కర్ణాటకలోని మైసూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అడవి పందిని తప్పించే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురికావడంతో నవవధువు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. పెళ్లైన కేవలం 15 రోజుల్లోనే ఈ విషాదం చోటుచేసుకోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

Also Read : Hyderabad : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి వీధుల్లో నగ్నంగా పరుగెత్తి.. ఆలయంలో మొక్కి.. చెరువు దూకిన యువతి

మైసూరు తాలుకా మోగనహుండి గ్రామానికి చెందిన మేఘనకు, నంజనగూడు తాలుకా బిదరగోడుకు చెందిన పునీత్‌తో 15 రోజుల క్రితమే వివాహం జరిగింది. ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో సంప్రదాయం ప్రకారం మేఘన తన అమ్మమ్మ ఇంటికి మోగనహుండికి వెళ్లింది. గురువారం సాయంత్రం భార్యను కలిసేందుకు వెళ్లిన పునీత్, అనంతరం ఆమెతో కలిసి నగరానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.

రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఆర్‌టీ నగర్ సమీపానికి చేరుకోగానే అకస్మాత్తుగా ఓ అడవి పంది రోడ్డుపైకి రావడంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పి స్కిడ్ అయింది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్‌లో వారిని కువెంపునగర్ ఆస్పత్రికి తరలించారు. అయితే తలకు తీవ్ర గాయాలైన మేఘన చికిత్స పొందుతూ మృతిచెందింది. పునీత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ప్రమాద సమయంలో పునీత్ హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని అధికారులు తెలిపారు. వెనుక కూర్చున్న మేఘన కూడా హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణనష్టం తప్పేదేమోనని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై జయపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.