నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఏప్రిల్ 20వ తేదీ నుంచి జాతీయ రహదారులపై టోల్ వసూళ్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం అయ్యింది. కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా అత్యవసర సేవలను సులభతరం చేయడానికి జాతీయ రహదారులపై టోల్ వసూళ్లను మార్చి 25వ తేదీన తాత్కాలికంగా నిలిపివేయగా.. ఇప్పుడు వాటిని పునరుద్ధరించాలంటూ.. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్‌హెచ్ఏఐకి లేఖ రాసింది.
అయితే కేంద్రం సూచనపై రవాణా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా రవాణా రంగం పూర్తిగా కుదేలైందని, ఎన్నో ఇబ్బందులు తట్టుకుని నిత్యావసర సరుకుల రవాణా కొనసాగిస్తుంటే.. ఈ నిర్ణయం సరికాదని అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. రవాణా రంగాన్ని ఆదుకోవాల్సింది పోయి.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాద
ట్రక్కులు మరియు ఇతర వస్తువులు/క్యారియర్ వాహనాలు అంతర్రాష్ట్రంలో కదలికలు కొనసాగుతున్న సమయంలో హోంమంత్రిత్వ శాఖ అందించిన సడలింపుల దృష్ట్యా.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలను పాటించడానికి అవసరమైన చర్యలను NHAI తీసుకోవాలి.(breaking news : ఇండియన్ నేవీలో కరోనా)