NIA raids
NIA Raids : తమిళనాడులో నిషేధిత (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)పీఎఫ్ఐతో సంబంధాలున్న ఓ వ్యక్తి ఇంటిపై ఎన్ఐఏ దాడులు చేసింది. పీఎఫ్ఐతో లింకులు ఉన్నాయన్న అనుమానంతో నేలపట్టయ్ కు చెందిన ఉమర్ షరీఫ్ అనే ఆటో డ్రైవర్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. అతని ఇంట్లో ఆయుధాలు లభ్యమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. అతని ఇంటి సమీపంలో సిలంబమ్ కళను నేర్పిస్తున్నారని వెల్లడించారు.
కాగా, ఏడాది సెప్టెంబర్ 28న పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలు సీఎఫ్ఐ, ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్, రిహాబ్ ఇండియా ఫౌండేషన్, నేషనల్ ఉమెన్ ఫ్రంట్ సంస్థలను కూడా చట్ట విరుద్ధమైన సంస్థలుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
Ban On Popular Front of India: పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం
2006లో పీఎఫ్ఐ ఏర్పాటైంది. తొలిసారి కేరళలో ప్రారంభమైన పీఎఫ్ఐ దేశమంతటా విస్తరించింది. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న ఈ సంస్థ.. మైనారిటీలు, దళితులు, అణగారిన వర్గాల సాధికారతే లక్ష్యంగా పని చేయనున్నట్లు వెల్లడించింది. కానీ ఈ ముసుగులో రాడికల్ ఇస్తాంను ప్రచారం చేస్తోందని భద్రతా సంస్థలు తెలిపాయి.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు పిలుపివ్వడం, హింసాత్మక ఘటనలకు పాల్పడటం, కరాటే పేరుతో యువతకు ఉగ్రవాద శిక్షణ ఇవ్వడం, అమాయకపు యువతను రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు పీఎఫ్ఐపై ఆరోపణలు ఉన్నాయి.