నిర్భయ దోషి అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటిషన్‌ను కొట్టేసింది సుప్రీంకోర్టు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు నిందితుల్లో ఒకడైన అక్షయ్ సింగ్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
దీనికి సంబంధించిన పిటీషన్‌ని కొట్టేసింది కోర్టు. తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలంటూ అక్షయ్ సింగ్ తన న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు.
తనను తప్పుగా దోషిగా నిర్ధారించారని, పలు దేశాల్లో ఉరిశిక్షలను రద్దు చేశారంటూ పలు న్యాయ సంబంధిత వాదనలను అందులో వెల్లడించారు. ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్యంని కూడా ఆ పిటీషన్‌లో అందులో ప్రస్తావించాడు.
అయితే పున: సమీక్షలో రివ్యూ చెయ్యడానికి అంశాలు ఏమీ లేవు అని చెప్పింది కోర్టు. దీంతో నలుగురు దోషులకు ఉరి శిక్షకు లైన్ క్లియర్ చేసింది. దీనిపై ఇంక పటియాల కోర్టులో మరికాసేపట్లో శిక్ష ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయం తేలనుంది.
మానవత్వం మంట గలిసి రీతిలో నలుగురు నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారని, వారిని క్షమించడానికి అర్హులు కారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో స్పష్టం చేశారు.
ఈ పిటిషన్‌ను జస్టిస్ ఆర్. భానుమతి, అశోక్ భూషణ్, బొపన్నలతో కూడిన బెంచ్ విచారించింది. నిర్భయ తల్లిదండ్రులు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు.