NITI Aayog Meeting: మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం.. దూరంగా బీజేపీయేతర పార్టీల సీఎంలు .. ఢిల్లీలో సీఎం జగన్

నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం జగన్, ఒడిశా జీఎం నవీన్ పట్నాయక్ పాల్గొంటున్నారు. మిగిలిన బీజేపీయేతర పార్టీల ముఖ్యమంత్రులు ఈ సమావేశంకు దూరంగా ఉండనున్నారు.

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశం ఈ రోజు జరగనుంది. తొలిసారి ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. సమావేశంలో ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గోనున్నారు. ఉదయం 10:30కి నీతిఆయోగ్ పాలకమండలి సమావేశానికి వచ్చిన ప్రతినిధులతో మోడీ గ్రూప్ ఫోటో ఉంటుంది. ఉదయం 10:55 గంటలకు ప్రధాని మోదీ, నీతి ఆయోగ్ చైర్మన్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు.

PM Narendra Modi : మోదీ మరో అరుదైన ఘనత .. రెండు దేశాల అత్యున్నత పురస్కారాలు అందుకున్న భారత ప్రధాని

నీతి ఆయోగ్ పాలకమండలిలో ఎనిమిది అంశాల‌పై చర్చ జరుగుతుంది. వికసిత్ భారత్ @ 2047 – టీమ్ ఇండియా పాత్ర, MSMES లపై నమ్మకం, మౌలిక సదుపాయాలు – పెట్టుబడులు, సమస్యలు తగ్గించడం, మహిళా సాధికారత, ఆరోగ్యం- పోషణ, నైపుణ్య అభివృద్ధి, ఏరియా డెవలప్‌మెంట్ సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం గతి శక్తి, అంశాలపై చర్చలు జరుపుతారు. ఎనిమిది అంశాలపై చర్చ అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ముగింపు ఉపన్యాసం చేయనున్నారు.

New Parliament Building : ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొత్త పార్లమెంట్ భవనం .. 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం..

నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు 48 గంటల ముందు చేసిన ఆర్టీపిసీఆర్ టెస్ట్ తప్పనిసరి. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు మొబైల్ ఫోన్‌లు, ఐప్యాడ్, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. ఈ నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం జగన్, ఒడిశా జీఎం నవీన్ పట్నాయక్ పాల్గోనున్నారు. బీజేపీయేతర పార్టీల ముఖ్యమంత్రులు ఈ సమావేశంకు దూరంగా ఉండనున్నారు.

ట్రెండింగ్ వార్తలు