PM Narendra Modi : మోదీ మరో అరుదైన ఘనత .. రెండు దేశాల అత్యున్నత పురస్కారాలు అందుకున్న భారత ప్రధాని

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మరో అరుదైన ఘతన సాధించారు. జపాన్ పర్యటనలో ఉన్న మోదీ రెండు దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. మోదీకి ఒకే రోజు రెండు దేశాల అత్యుతన్న పురస్కారాలు అందించాయి.

PM Narendra Modi : మోదీ మరో అరుదైన ఘనత .. రెండు దేశాల అత్యున్నత పురస్కారాలు అందుకున్న భారత ప్రధాని

PM Narendra Modi

PM Modi Awards : భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మరో అరుదైన ఘతన సాధించారు. జపాన్ పర్యటనలో ఉన్న మోదీ రెండు దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. మోదీకి ఒకే రోజు రెండు దేశాల అత్యుతన్న పురస్కారాలు అందించాయి.ఫిజీ,పపువా న్యూగినియా అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. మోదికి ‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్టర్ ఆఫ్ ఫిజి’తో ఫిజీ సత్కరించింది.అలాగే పపువా న్యూ గినియా ఆ దేశ అత్యున్నత పురస్కారం అయిన ‘‘కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు’’ను ప్రదానం చేసింది.

ప్రధాని మోడీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా..ఫిజీ ప్రధానమంత్రి సితివేని రబుకా ‘‘ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’’తో మోడీని సత్కరించారు. ఫిజియేతరులు అతి కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకోగా వారిలో ప్రధాని మోదీ అరుదైన వ్యక్తిగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే పపువా న్యూ గినియా భారత ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘‘కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు’’ను ప్రదానం చేసింది. పపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడే ఈ పురస్కారాన్ని ప్రధాని మోడీకి బహుకరించారు. ఈ అవార్డును స్వీక‌రించిన ప్ర‌ముఖుల‌లో మోడీ ఒక‌రుగా నిలిచారు.

అంతర్జాతీయంగా భారత్‌కు పెరుగుతున్న వేళ.. ప్రధాని మోదీకి వివిధ దేశాలు అరుదైన గౌరావాలను అందిస్తున్నాయి. ఇండియా – పసిఫిక్ ఐలాండ్స్ కో ఆపరేషన్ మూడో సదస్సులో కూడా మోదీకి అరుదైన గౌరవాలు దక్కాయి. ఈ అవార్డును అందించినందుకు ఫిజి గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడేకు ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది భారతదేశానికి, భారత ప్రజల విజయాలకు గొప్ప గుర్తింపు అని పేర్కొన్నారు.