Bihar: జేడీయూని లీడ్ చేయమని పీకేని కోరిన నితీశ్.. పీకే సమాధానం ఏంటంటే?

బిహార్ యువతను ఏకం చేసే యోచనలో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన ప్రశాంత్ కిశోర్.. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని తిరిగే పనిలో ఉన్నారు. ఈ యాత్రలో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర రాజధాని పాట్నాకు 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపారన్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర నుంచే ఆయన మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bihar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పలు సందర్భాల్లో సహాయం కోసం తనను ప్రాధేయపడ్డారంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన ఆరోపణలు చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల గెలుపు కోసం ఢిల్లీకి వచ్చి తనను బతిమాలుకున్న నితీశ్.. కొంత కాలం క్రితం జనతాదళ్ యూనియన్ పార్టీకి నాయకుడిగా ఉండి నడిపించమని కోరినట్లు పేర్కొన్నారు. 2015 లో ఏం జరిగిందో తెలిసిందే. అయితే తాజా ప్రతిపాదనకు తాను ఒప్పుకోలేదని పీకే వెల్లడించారు.

బిహార్ యువతను ఏకం చేసే యోచనలో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన ప్రశాంత్ కిశోర్.. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని తిరిగే పనిలో ఉన్నారు. ఈ యాత్రలో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర రాజధాని పాట్నాకు 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపారన్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర నుంచే ఆయన మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

KCR writes letter to EC: పార్టీ పేరు మార్పుపై ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్

‘‘ఆయన కుర్చీని కాపాడుకోవడంలో నితీశ్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆయన చాలా తెలివైనవారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం ఢిల్లీకి వచ్చి నన్ను బతిమాలుకున్నారు. 2015లో ముఖ్యమంత్రిగా గెలిచేందుకు ఆయనకు నేను పలు సూచనలు చేశాను. దాని నుంచి వచ్చిందే మహాగట్‭బంధన్. కానీ, నాకు ఈరోజు ఆయన జ్ణానం తెప్పించారు’’ అని పీకే అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘మీడియాలో మీరు చూసే ఉంటారు. 10-15 రోజుల కింద ఆయనను నన్ను తన నివాసానికి పిలిపించుకున్నారు. ఆయన పార్టీకి నాయకత్వం వహించి నడిపించాలని నన్ను అడిగారు. అది సాధ్యం కాదని నేను తేల్చి చెప్పాను. ఒకసారి నేను వదులుకున్న స్థానానికి తిరిగివెళ్లలేను. నా కమిట్మెంట్‭ని కాదనలేను’’ అని అన్నారు.

AltNews: ఫ్యాక్ట్ చెకర్లు మహ్మద్ జుబైర్, ప్రతీక్ సిన్హాలకు నోబెల్ ప్రైజ్!

ట్రెండింగ్ వార్తలు