నితీష్ కు ఫేర్ వెల్ పార్టీ ఖాయం – తేజస్వి యాదవ్

  • Publish Date - November 2, 2020 / 04:17 PM IST

Nitish Kumar farewell is guaranteed’: Tejashwi Yadav : బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సీఎం నితీష్ కుమార్ మధ్య మాటల యుధ్ధం తారాస్థాయికి చేరుకొంటోంది. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాష్ట్రాన్ని పాలించే ఓపిక ఆయనకు లేదని, ఈ ఎన్నికల్లో విపక్ష మహాఘట్ బంధన్ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమన్నారు.



నితీష్ కు ఫేర్ వెల్ పార్టీ ఖాయమన్నారు తేజస్వి యాదవ్. బీహార్ రాష్ట్రంలో లక్ష జనాభాకు కేవలం 77 మంది పోలీసులు మాత్రమే ఉన్నారని లెక్కలు చెప్పారు. ఉద్యోగ ఖాళీలను ఇంకా భర్తీ చేయలేదని, తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అడుగుతున్నట్లు వెల్లడించారు. 15 సంవత్సరాల్లో సాధించలేనిది తాము చేయగలమనే ధీమాను వ్యక్తం చేశారు. జేడీయూ – బీజేపీ ప్రభుత్వంపై ఆర్జేడీ విమర్శల దాడి చేస్తోంది.



ఉద్యోగాలు, కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తోంది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత..10 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీని ప్రజల్లోకి తీసుకెళుతున్నారాయన. అయితే..ఇది అసాధ్యమని నితీష్ కొట్టిపారేస్తున్నారు.



బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నాలుగు విడతలుగా ఈసీ నిర్వహించనుంది.
బీహార్‌ అసెంబ్లీలోని మూడో వంతు స్ధానాల్లో రెండోదశ ఎన్నికల పోలింగ్‌ 2020, నవంబర్ మూడో తేదీ మంగళవారం జరగబోతోంది. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.



స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి ఏకంగా ఏడు ర్యాలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మహాకూటమి అభ్యర్థులను ఎదుర్కొనడానికి సీఎం నితీశ్ కుమార్…తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకొనే విధంగా ఆర్జేడీ వ్యూహాలు రచిస్తోంది. ఇరు కూటములకూ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.