PM Candidature: నాకు ఆ కోరిక లేదు.. ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై నితీశ్ సంచలన ప్రకటన

ఆ పదవికి తానేమీ హక్కుదారును కాదని, కనీసం ఆ కోరికైనా తనకు లేదంటూ బాంబు పేల్చారు. వారం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‭తో జరిగిన ప్రెస్‭మీట్‭లో మీడియాపై నితీశ్ కాస్త అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పదే పదే ప్రధాని అభ్యర్థి గురించి అడుగుతుండడంతో నితీశ్‭కు విసుగొస్తోందట. ఆ అసంతృప్తిని పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లగక్కారు కూడా.

PM Candidature: వచ్చే(2024) దేశ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే అంశమై విపక్షాల్లో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే కొద్ది రోజుల నుంచి బిహార్ సీఎం నితీశ్ కుమార్ పేరు బాగా వినిపిస్తోంది. విపక్షాల ప్రధాని అభ్యర్థి నితీశేనని ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ సైతం ఓ సందర్భంలో తేల్చి చెప్పడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. దీనికి తోడు దేశంలోని విపక్ష నేతలను నితీశ్ వరుస పెట్టి కలుస్తున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కోసమే నితీశ్ ఇంతలా కష్టపడుతున్నారని అనుకుంటున్నారు.

కానీ, ఇంతలోనే నితీశ్ సంచలన ప్రకటన చేశారు. ఆ పదవికి తానేమీ హక్కుదారును కాదని, కనీసం ఆ కోరికైనా తనకు లేదంటూ బాంబు పేల్చారు. వారం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‭తో జరిగిన ప్రెస్‭మీట్‭లో మీడియాపై నితీశ్ కాస్త అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పదే పదే ప్రధాని అభ్యర్థి గురించి అడుగుతుండడంతో నితీశ్‭కు విసుగొస్తోందట. ఆ అసంతృప్తిని పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లగక్కారు.

అయితే సోమవారం ఢిల్లీకి వచ్చిన ఆయన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని కలిశారు. ఇక మంగళవారం ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‭తో సమావేశమయ్యారు. మధ్యాహ్నం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నితీశ్ మాట్లాడుతూ ‘‘పదే పదే అదే ప్రశ్న అడుగుతున్నారు. ప్రధాని పదవికి నేనేమీ హక్కుదారును కాదు. కనీసం ఆ కోరిక కూడా నాకు లేదు’’ అని సమాధానం ఇచ్చారు.

Maharashtra Cop House : ఎస్ఐ ఇంట్లోనే దొంగతనం.. పది లక్షల విలువైన బంగారం, నగదు చోరీ

ట్రెండింగ్ వార్తలు