Nitish Kumar Meets Arvind Kejriwal: కేజ్రీవాల్‌తో నితీశ్ కుమార్ చర్చలు.. ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న బిహార్ సీఎం

లోక్‌సభ ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా ఢిల్లీలో పర్యటిస్తోన్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ యాదవ్ ఇవాళ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, జేడీయూ నేత సంజయ్ ఝా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకు ముందు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాతో నితీశ్ కుమార్ చర్చించారు.

Nitish Kumar Meets Arvind Kejriwal: కేజ్రీవాల్‌తో నితీశ్ కుమార్ చర్చలు.. ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న బిహార్ సీఎం

Lok Sabha elections 2024

Nitish Kumar Meets Arvind Kejriwal: లోక్‌సభ ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా ఢిల్లీలో పర్యటిస్తోన్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, జేడీయూ నేత సంజయ్ ఝా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకు ముందు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజాతో నితీశ్ కుమార్ చర్చించారు.

కాసేపట్లో నితీశ్ కుమార్ హరియాణా మాజీ సీఎం, ఐఎన్ఎల్డీ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలాను కలవనున్నారు. నిన్న నితీశ్ కుమార్ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా పాల్గొని చర్చించారు. ఢిల్లీలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలుస్తానని నితీశ్ కుమార్ అన్నారు.

అలాగే, నిన్న సాయంత్రం రాహుల్ గాంధీని కలిసి చర్చించారు. తన రెండో పర్యటనలో కూడా నితీశ్ కుమార్ 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తున్నారు. కాగా, దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీ 50 సీట్లకే పరిమితం అవుతుందని నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అయితే, ఆ తర్వాత తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.

Massive Earthquake In China: చైనాలో భారీ భూకంపం.. 46 మంది మృతి