Amarnath Yatra
Amarnath Yatra: గతేడాది లాగే ఈ ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్రను రద్దు చేసినట్లు ప్రకటించారు అధికారులు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా తీర్థ యాత్రను క్యాన్సిల్ చేశారు. ఈ నిర్ణయాన్ని జమ్మూ అండ్ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రిన్ బోర్డుతో చర్చలు జరిపిన అనంతరం ప్రకటించారు. హారతి కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు.
56రోజుల పాటు జరిగే యాత్ర చేసి 3వేల 880మీటర్ల ఎత్తులో ఉండే పరమేశ్వరుని చేరుకుంటారు. ఈ యాత్రకు రెండు దారులు ఉన్నాయి. ఒకటి పహల్గమ్, రెండు బల్తాల్. ఈ తీర్థ యాత్రను కొవిడ్ కారణంగా 2020లోనూ క్యాన్సిల్ చేశారు.
గత వారం మనోజ్ సిన్హా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయి జమ్మూ అండ్ కశ్మీర్ లో సెక్యూరిటీ సిచ్యుయేషన్ గురించి వివరించారు. మీటింగ్ లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, యూనియన్ హోం సెక్రటరీ అజయ్ భల్లా, టాప్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.