×
Ad

Union Budget 2026: సండే నో హాలిడే.. ఆదివారం కూడా పని చేయనున్న స్టాక్ మార్కెట్లు.. కారణం ఏంటంటే

భారత బడ్జెట్ చరిత్రలో ఇదొక అరుదైన సందర్భం అని చెప్పాలి. చివరగా 2000 సంవత్సరంలో బడ్జెట్‌ను ఆదివారం రోజు ప్రవేశపెట్టారు.

Indian Stock Market Representative Image (Image Credit To Original Source)

  • భారత బడ్జెట్ చరిత్రలో అరుదైన సందర్భం
  • దాదాపు 26 ఏళ్ల తర్వాత రిపీట్
  • ఆదివారం రోజున బడ్జెట్
  • సండే కూడా పని చేయనున్న స్టాక్ మార్కెట్లు

Union Budget 2026: మామూలుగా అయితే శని, ఆదివారాల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ కు సెలవు ఉంటుంది. ఆ రెండు రోజులు స్టాక్ మార్కెట్లు (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్-BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్-NSE) పని చేయవు. ఇక పబ్లిక్ హాలిడేస్ లో కూడా స్టాక్ మార్కెట్లు వర్క్ చేయవు. అయితే, ఈ ఆదివారం అందుకు భిన్నంగా ఉండబోతోంది. ఫిబ్రవరి 1 ఆదివారం రోజున స్టాక్ మార్కెట్ కు సెలవు లేదు. ఆరోజున స్టాక్ మార్కెట్లు పని చేస్తాయి. ఫిబ్రవరి 1న ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. దీనికి కారణం బడ్జెట్. ఫిబ్రవరి 1న ఆదివారం అయినా.. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆరోజు మార్కెట్లు తెరిచి ఉంచాలని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిర్ణయించాయి.

ఉదయం 9.15 గంటల నుంచి మ.3.30 గంటల వరకు ట్రేడింగ్..

ఈ ఆదివారం అంటే… ఫిబ్రవరి 1న స్టాక్ మార్కెట్ తెరుచుకోనుంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 1వ తేదీ ఆదివారం వచ్చింది. అయినా బడ్జెట్ ను అదే రోజున ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రకటనలు, పన్ను మార్పులు, వివిధ రంగాలకు కేటాయింపులు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్ల సౌకర్యార్థం మార్కెట్లు తెరిచి ఉంచాలని సెబీ, ఎక్స్ఛేంజీలు నిర్ణయించాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 9గంటల 15 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు ట్రేడింగ్ కొనసాగుతుందని సర్యులర్ లో వెల్లడించాయి.

ఆదివారం రోజు కూడా బడ్జెట్ సందర్భంగా పూర్తి స్థాయి ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నట్లు ఎక్స్చేంజీలు సర్క్యులర్ జారీ చేశాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమై 9.08 గంటల వరకు ప్రీ ఓపెన్ సెషన్ నిర్వహిస్తారు. 9గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు సాధారణ ట్రేడింగ్ జరగనుంది. ఈక్విటీ, ఎఫ్ అండ్ ఓ, కమొడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లలో లావాదేవీలు యథావిధిగానే జరుగుతాయి.

చివరగా 2000 సంవత్సరంలో ఆదివారం రోజున..

భారత బడ్జెట్ చరిత్రలో ఇదొక అరుదైన సందర్భం అని చెప్పాలి. చివరగా 2000 సంవత్సరంలో బడ్జెట్‌ను ఆదివారం రోజు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత.. అంటే.. దాదాపు 26 ఏళ్ల తర్వాత అదే రిపీట్ అవుతోంది. బడ్జెట్ ఆదివారం రోజు ప్రవేశ పెడతారు. ఇక 2015, 2025లో శనివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా మార్కెట్లను ప్రత్యేకంగా తెరిచి ఉంటారు. ఇప్పుడు దశాబ్దాల తర్వాత ఆదివారం రోజున బడ్జెట్ వచ్చింది. ఇన్వెస్టర్లు తక్షణమే స్పందించేందుకు వీలుగా ఆదివారం రోజు అయినా.. లైవ్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ ఏడాది బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకం. ఆమె వరుసగా 9వ సారి బడ్జెట్‌ను సమర్పించి రికార్డ్ నెలకొల్పబోతున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశ పెడతారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుండి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి, మొదటి దశ ఫిబ్రవరి 13న ముగుస్తుంది. ప్రభుత్వ సిఫార్సును అనుసరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సమావేశాన్ని ఆమోదించారు. జనవరి 10న రాష్ట్ర ఆర్థిక మంత్రులతో ముందస్తు బడ్జెట్ సమావేశాలు జరిగాయి.

Also Read: ఈ ట్రైన్లలో ఆర్‌ఏసీ ఉండదు.. ఓన్లీ కన్ఫార్మ్‌ స్లీపర్‌ క్లాస్‌.. చార్జీలు ఎంతో తెలుసా?