Evm Cec Subhan 10tv
5 State Election Results: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM)లతో ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నారంటూ సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ చేసిన ఆరోపణలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) సుశీల్ చంద్ర రెస్పాండ్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ పారదర్శకంగానే పనిచేస్తుంది. ఈవీఎం ట్యాంపరింగ్ పై ప్రశ్నే లేదని అంటున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశాం. ఎందుకంటే పొలిటికల్ పార్టీలకు ఈవీఎంల తరలింపు వెనుక ఉద్దేశ్యం.. ఆ పద్ధతుల గురించి వివరంగా వెల్లడించలేకపోయారని అన్నారు.
‘ఈవీఎం ట్యాంపరింగ్ పై ప్రశ్నేలేదు. ఈవీఎంలను 2004 నుంచి 2019వరకూ వాడుతూనే ఉన్నాం. దాంతో పాటు ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ నిర్వహిస్తూనే ఉన్నాం. వాటిని పరిశీలించిన తర్వాత ఈవీఎంలకు రాజకీయ పార్టీల సమక్షంలో సీల్ వేస్తాం. సంతకాలు తీసుకుంటాం. ఈవీఎంలను త్రీ టైర్ సెక్యూరిటీతో స్ట్రాంగ్ రూంలో ఉంచుతాం. 24గంటలు పర్యవేక్షించేందుకు సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తాం. రాజకీయ పార్టీలు కూడా స్ట్రాంగ్ రూంలను చూస్తూనే ఉంటారు’
Read Also : ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా..?
‘ఈ సమయంలో ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడే అవకాశమే లేదు. ఒక్క ఈవీఎంను కూడా స్ట్రాంగ్ రూం నుంచి బయటకు తీసుకుపోలేరు. వారణాసిలో ఈవీఎంలను తరలించింది ట్రైనింగ్ పర్పస్ కోసం మాత్రమే. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో భాగంగా తరలించిన ఈవీఎంల గురించి రాజకీయ పార్టీలకు సరైన సమాచారం ఇవ్వలేకపోయారు ఏడీఎం. ఈవీఎంల గురించి ప్రశ్నించిన రాజకీయ పార్టీకి ఈవీఎంలను చూపించి వివరించాం’ అని అన్నారు.